నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘బింబిసార’. ఈయన సక్సెస్ ఫెయిల్యూర్స్‌కు అసలు సంబంధం లేకుండా డిఫరెంట్ సినిమాలు చేయడానికి ఆసక్తి చూపించే హీరోల్లో కల్యాణ్‌రామ్ (Kalyan Ram ) ఒకరు. ఇతను హీరోగానే కాదు.. మంచి అభిరుచి ఉన్న నిర్మాతగా ప్రూవ్ చేసుకున్నాడు. తాజాగా ఈ సినిమా సెన్సార్ పూర్తి చేసుకుంది.
హీరో నందమూరి కల్యాణ్‌రామ్ (Kalyan Ram) టైటిల్ రోల్లో నటిస్తున్న చిత్రం బింబిసార (Bimbisara). వశిష్ఠ్ (Vasisth) దర్శకత్వం వహిస్తున్నాడు. ఆగస్టు 5న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానున్న నేపథ్యంలో ఇప్పటికే కల్యాన్ రామ్ టీం ప్రమోషన్స్ లో బిజీగా ఉంది. కాగా ఇపుడు మేకర్స్ కొత్త అప్డేట్ అందించారు.
పీరియాడిక్, సైన్స్ ఫిక్షన్ జానర్లో వస్తున్న ఈ సినిమాకు కీరవాణితో పాటు చిరంతన్ భట్ సంగీతం అందిస్తున్నారు. వశిష్ట్ ఈ (Bimbisara) సినిమాకు దర్శకత్వం వహించారు. ఎన్టీఆర్ ఆర్ట్స్ పతాకంపై ఈ సినిమా తెరకెక్కుతోంది. ఓ పుణ్యభూమి అందులో బార్భేరియన్ కింగ్.. బింబిసారగా (Bimbisara) కళ్యాణ్ రామ్ (Kalyan Ram ) ఇందులో కనిపించనున్నారు. తాజాగా సెన్సార్ వాళ్లు U/A సర్టిఫికేట్ జారీ చేశారు. ఇక రన్ టైమ్ 2 గంటల 26 నిమిషాలకు లాక్ చేశారు. (Twitter/Photo)
రాక్షసులు ఎరగని రావణ రూపం. శతృవులు గెలవలేని కురుక్షేత్ర యుద్ధం. త్రిగర్తల సామ్రాజ్యధినేత బింబిసారుడి విశ్వరూపం. బింబిసారుడు అంటేనే మరణ శాసనం తో పాటు ఇక్కడ రాక్షసుడైనా.. భగవంతుడైనా బింబిసారుడుగా కళ్యాణ్ రామ్ చెప్పే డైలాగులు బాగున్నాయి.బార్బేయన్ కింగ్ బింబిసారుడు దాచి పెట్టిన నిధి సొంతం చేసుకోవడానికీ కొన్ని దుష్ట శక్తులు పన్నాగం పన్నుతాయి. (Twitter/Photo)
ఇక కళ్యాణ్ రామ్ (Kalyan Ram ) ‘బింబిసార’ (Bimbisara) మూవీతో పాటు .. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలో రాజేంద్ర అనే కొత్త దర్శకుడితో మరో సినిమా చేస్తున్నారు. ఈ సినిమాలో కళ్యాణ్ రామ్ (Kalyan Ram ) తొలిసారి త్రిపాత్రాభినయం చేస్తున్నట్టు సమాచారం. దీంతో పాటు ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్లో తెరకెక్కుతోన్న సినిమాకు ఓ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. మరోవైపు ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ సినిమాను కూడా మైత్రీ మూవీ మేకర్స్‌తో కలిసి కళ్యాణ్ రామ్ నిర్మిస్తున్నారు. (Twitter/Photo)