Home » photogallery » movies »

TOLLYWOOD TOP MOVIES 2021 RAVI TEJA KRACK PAWAN KALYAN VAKEEL SAAB TO BALAKRISHNA AKHANDA ALLU ARJUN PUSHPA HERE ARE THE LIST TA

Tollywood Top Movies 2021 : అఖండ,వకీల్ సాబ్,పుష్ప సహా 2021లో టాలీవుడ్‌లో అత్యధిక కలెక్షన్స్ రాబట్టిన సినిమాలు..

Tollywood Top Movies 2021 : కరోనా ఫస్ట్ వేవ్ తర్వాత 2020లో డిసెంబర్‌లో మెల్ల మెల్లగా తెలుగు సినిమాలు విడుదల కావడం ప్రారంభం అయ్యాయి. ఈ కోవలో 2021 సంక్రాంతికి రవితేజ.. క్రాక్ మూవీతో బోణి కొట్టారు. ఆ తర్వాత మాస్టర్ సినిమా కూడా మంచి వసూళ్లనే దక్కించుకుంది. ఆ తర్వాత ‘నాంది’, ‘ఉప్పెన’ జాతి రత్నాలు’ వంటి చిత్రాలు బాక్సపీస్ దగ్గర రఫ్పాడించాయి. అటు పవన్ కళ్యాణ్ నటించిన ‘వకీల్ సాబ్’ వరకు అంతా బాగనే ఉంది. ఇంతలో సెకండ్ వేవ్‌తో అంతా తారుమారైంది. ఆ తర్వాత ఆరు నెలల తర్వాత ‘అఖండ’ మంచి ఓపెనింగ్స్ రాబట్టింది. ఆ తర్వాత ’పుష్ప’.. శ్యామ్ సింగరాయ్ వంటి వరుసగా సినిమాలు థియేటర్స్‌లో క్యూ కట్టాయి. వీటిలో అత్యధిక వసూళ్లు సాధించిన టాప్ చిత్రాల విషయానికొస్తే..