Tollywood Top Most Profitable Movies: రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా RRR మూవీతో మరోసారి రికార్డుల వేట గురించి చర్చ మొదలైంది. ఈ సినిమా ఫస్ట్ డే అత్యధిక వసూళ్లను సాధించిన మూవీగా రికార్డులకు ఎక్కింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ సాధించడమే కాకుండా.. రూ. 100కోట్లకు పైగా లాభాలను తీసుకొచ్చింది. ఈ యేడాది సంక్రాంతి కానుకగా చిరంజీవి హీరోగా విడుదలైన ‘వాల్తేరు వీరయ్య’ సినిమా బ్రేక్ ఈవెన్ సాధించడమే కాకుండా ఎక్కువ లాభాలను తీసుకున్న సినిమాగా రికార్డులకు ఎక్కింది. ఈ నేపథ్యంలో ఆర్ఆర్ఆర్, వాల్తేరు వీరయ్య సహా తెలుగులో అత్యధిక లాభాలను తీసుకొచ్చిన టాప్ సినిమాల విషయానికొస్తే..(File/Photo)
1. బాహుబలి 2 | రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా తెరకెక్కిన ‘బాహుబలి’ సినిమా తెలుగుతో పాటు ప్యాన్ ఇండియా లెవల్లో హైయ్యెస్ట్ కలెక్షన్స్ సాధించిన సినిమాగా రికార్డులకు ఎక్కింది. బాహుబలి సినిమా ప్రపంచ వ్యాప్తంగా రూ. 195 కోట్ల బిజినెస్ చేస్తే.. రూ. 352 కోట్ల షేర్ లాభాలు వచ్చాయి. ప్రపంచ వ్యాప్తంగా రూ. 360 కోట్ల బిజినెస్ చేస్తే.. రూ. 860 కోట్లు వచ్చాయి. మొత్తంగా ఈ సినిమా రూ. 508 కోట్ల లాభాలను తీసుకొచ్చింది. ఈ సినిమా వాల్డ్ వైడ్‌గా రూ. 860 కోట్ల షేర్ సాధించింది.
2017లో రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా తెరకెక్కిన ‘బాహుబలి 2’ చిత్రం తెలుగు సినీ ఇండస్ట్రీలో భారతీయ సినీ ఇండస్ట్రీలో ఎక్కువ వసూళ్లను సాధించిన చిత్రంగా రికార్డులకు ఎక్కింది. ఈ చిత్రం దాదాపు రూ 1800 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించింది. తెలుగులో ఈ సినిమా రూ. 325 కోట్ల షేర్ సాధించింది. మిగతా అన్ని భాషల్లో కలిపి రూ. 831 కోట్ల షేర్ సాధించింది. 2017 హైయ్యెస్ట్ గ్రాసర్‌గా నిలిచింది.
2. 2015 - బాహుబలి | రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా తెరకెక్కిన బాహుబలి సిరీస్‌లో వచ్చిన బాహుబలి ది బిగినింగ్ సినిమా దాదాపు రూ. 600 కోట్ల గ్రాస్ వసూళ్లను అన్ని భాషల్లో కలిసి సాధించింది. తెలుగులో రూ. 191 కోట్ల షేర్ సాధించింది. అన్ని భాషల్లో కలిపి ఓవరాల్‌గా రూ. 311 కోట్ల షేర్ సాధించి రూ. 186 కోట్ల లాభాలను తీసుకొచ్చింది. రెండు భాగాలు కలిపితే.. రూ. 694 కోట్ల షేర్ నిర్మాతలకు లాభాలను తీసుకొచ్చింది. (Twitter/Photo)
3.RRR | అన్ని ఏరియాల్లో కలిపి ఈ సినిమాను రూ. 451 కోట్లకు అమ్మారు. ఈ సినిమా అన్ని ఏరియాల్లో ఓవరాల్‌గా రూ. 111.41 కోట్ల లాభాలతో సూపర్ హిట్ స్టేటస్ అందుకుంది. ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో రూ. 272.31 కోట్లు షేర్ (రూ. 415 కోట్లు గ్రాస్ ) వసూళ్లును సాధించాయి. ఇక ప్రపంచ వ్యాప్తంగా రూ. 620.06 కోట్లు షేర్ (రూ.1234.10 కోట్ల గ్రాస్) / (రూ.. 451 కోట్లు) సాధించాయి. ఆర్ఆర్ఆర్ రాజమౌళి (Rajamouli) డైరెక్షన్లో తెరకెక్కిన ఈ మూవీ మొదటి రోజు అన్ని రికార్డులు బద్దలు కొట్టింది. ఎన్టీఆర్, రామ్ చరణ్ (Jr NTR, Ram Charan) వంటి అగ్ర హీరోలు కలిసి నటించిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఒక్కో రికార్డును స్మాష్ చేస్తూ వెళుతోంది. ఈ సినిమా ఇప్పటి వరకు రూ. 171.03 కోట్ల లాభాలతో మూడో స్థానంలో ఉంది. (Twitter/Photo)
4.అల వైకుంఠపురములో | త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో అల్లు అర్జున్, పూజా హెగ్డే హీరో, హీరోయిన్లుగా నటించిన ‘అల వైకుంఠపురములో’ తెరకెక్కిన ఈ మూవీ రూ. 85 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. ఓవరాల్‌గా ఈ చిత్రం 160.37 కోట్లతో బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది. ఓవరాల్‌గా రూ. 75.88 కోట్ల లాభాలను తీసుకొచ్చింది. మొత్తంగా 2020లో హైయ్యెస్ట్ గ్రాసర్‌గా నిలిచింది . (Twitter/Photo)
5.గీత గోవిందం: | విజయ్ దేవరకొండ సూపర్ స్టార్ గా మారడంలో అల్లు అర్జున్ పాత్ర చాలా ఉంది. అర్జున్ రెడ్డి కథను రిజెక్ట్ చేసి విజయ్ దేవరకొండకు లైఫ్ ఇచ్చిన అల్లు అర్జున్.. ఆ తర్వాత గీత గోవిందం కథ కూడా కాదు అనుకున్నాడు. సినిమాలో హీరోయిన్ డామినేషన్ ఉండడంతో అల్లు అర్జున్ స్టార్ ఇమేజ్ ఈ కథకు అడ్డు వచ్చింది. అందుకే కూడా చేయలేకపోయాడు బన్నీ. ఇదే సినిమా విజయ్ దేవరకొండ హీరోగా తెరకెక్కించి సంచలన విజయం అందుకొన్నాడు దర్శకుడు పరశురామ్. రూ. 15 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన ఈ సినిమా రూ. 70 కోట్ల షేర్‌తో పాటు రూ. 55.43 కోట్ల లాభాలాను తీసుకొచ్చింది.
7.వాల్తేరు వీరయ్య | మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన ‘వాల్తేరు వీరయ్య’ సినిమా సంక్రాంతి కానుకగా విడుదలైన ప్రపంచ వ్యాప్తంగా రూ. 137 కోట్ల షేర్.. బ్రేక్ ఈవెన్ మీద రూ. 48 కోట్ల ప్రాఫిట్.. బిజినెస్ మీద రూ. 49 కోట్ల లాభాలను తీసుకొచ్చి చిరంజీవి కెరీర్లో హైయ్యెస్ట్ షేర్ సాధించిన సినిమాగా రికార్డులకు ఎక్కింది.
8. రంగస్థలం: రామ్ చరణ్, సమంత హీరో హీరోయిన్లుగా నటించిన ‘రంగస్థలం’ మూవీ మంచి విజయాన్ని సాధించింది. హీరో: రామ్ చరణ్, దర్శకుడు: సుకుమార్, ఫస్ట్ వీక్ ఏపీ షేర్: రూ. 58.98 కోట్లు షేర్ సాధించింది. ఓవరాల్‌గా రూ. 122.37 కోట్ల వసూళ్లు సాధించింది. 2018లో హైయ్యెస్ట్ గ్రాసర్‌గా నిలిచింది . ఓవరాల్‌గా రూ. 47.52 కోట్ల లాభాలను తీసుకొచ్చింది. (File/Photo)
9. ‘పుష్ప’ | ఫుష్ప : అల్లు అర్జున్, రష్మిక మందన్న హీరో, హీరోయిన్లుగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ప్యాన్ ఇండియా లెవల్లో విడుదలై సంచలన విజయం సాధించింది. ఏపీలో తప్ప మిగతా అన్ని ఏరియాల్లో డిస్ట్రిబ్యూటర్స్‌కు నిర్మాతలకు లాభాలను తీసుకొచ్చింది. రూ. 144 .9 కోట్ల ప్రీ రిలీజ్ చేసిన ఈ సినిమా 6 వారాల్లో ఈ సినిమాకు రూ. 177.16 కోట్ల షేర్ వచ్చింది. మొత్తంగా రూ. 39.72 కోట్ల లాభాలను తీసుకొచ్చింది(Twitter/Photo)
11. కార్తికేయ 2 | ఎనర్జిటిక్ యంగ్ హీరో నిఖిల్, చందు మొండేటి దర్శకత్వంలో కార్తికేయకి సీక్వెల్‌గా వచ్చిన కార్తికేయ 2 తెలుగు సహా హిందీలో సంచలన విజయం సాధించింది. దేశమంతా ఈ చిత్ర సంచలనాలు కొనసాగుతున్నాయి. ఈ సినిమా ఓవరాల్‌గా ఇప్పటి వరకు రూ. 36 కోట్ల షేర్ లాభాలను తీసుకొచ్చింది. అంతేకాదు ఎక్కువ లాభాలను తీసుకొచ్చిన చిత్రాల్లో టాప్ 11లో నిలిచింది. (Karthikeya2 Twitter)
12. సోగ్గాడే చిన్నినాయనా: నాగార్జున సోగ్గాడే చిన్నినాయనా సినిమాకు మొదటి రోజు వచ్చిన టాక్‌కు.. అది తీసుకొచ్చిన వసూళ్లకు ఎక్కడా పొంతన లేదు. నాగ్ లాంటి సీనియర్ హీరో ఇలాంటి డబుల్ మీనింగ్ డైలాగులు చెప్పడమేంటి.. ఆ చాటుమాటు యవ్వారాలేంటి అంటూ విమర్శలు వచ్చాయి. కానీ చివరికి అదే సినిమా బ్లాక్‌బస్టర్ అయింది. రూ. 18.5 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన ఈ చిత్రం దాదాపు రూ. 31.2 కోట్ల లాభాలను తీసుకొచ్చింది. (Twitter/Photo)
13. ఉప్పెన : సాయి ధరమ్ తేజ్ తమ్ముడు, మెగాస్టార్ మేనల్లుడుగా వచ్చిన వైష్ణవ్.. తొలి సినిమా ఉప్పెనతో సంచలనం రేపాడు. కృతి శెట్టి హీరోయిన్గా నటించిన చిత్రం రూ. 51 కోట్ల షేర్ వసూలు చేసింది. మొత్తంగా తొలి సినిమాతో ఈ మూవీ సంచలనం రేపింది. ఈ మూవీ రూ. 20.5 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేస్తే .. రూ. 31.02 కోట్ల లాభాలను తీసుకొచ్చింది. 2021 యేడాది లో అత్యధిక లాభాలు తీసుకొచ్చిన రెండో చిత్రంగా నిలిచింది. ఓ రకంగా చెప్పాలంటే పెట్టిన పెట్టుబడికి వచ్చిన లాభాలు చూసుకుంటే.. మోస్ట్ ప్రాఫిటబుల్ మూవీగా నిలిచింది.
14. సీతా రామం | హను రాఘవపూడి దర్శకత్వంలో దుల్కర్ సల్మాన్ హీరోగా మృణాల్ ఠాకూర్ హీరోయిన్గా రష్మిక మందన్న మరో ముఖ్యపాత్రలో నటించిన లేటెస్ట్ క్లాసిక్ సీతా రామం. ఆగస్టు 5న విడుదలైన ఈ సినిమా మంచి కలెక్షన్స్ రాబట్టింది. రూ. 17 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రూ. 46.50 కోట్ల షేర్ (రూ. 98.10 కోట్ల గ్రాస్) వసూళ్లను సాధిచింది. పెట్టిన పెట్టుబడికి రూ. 29.50 కోట్ల థియేట్రికల్‌గా లాభాలను తీసుకొచ్చింది(Twitter/Photo)
15. బింబిసార | నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా వశిష్ఠ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా తెలుగులో రూ.15.60 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. రూ. 16.20 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో బరిలో దిగిన ఈ సినిమా ఓవరాల్‌గా రూ. 37.92 కోట్ల షేర్ (రూ. 65.20 కోట్ల గ్రాస్) వసూళ్లను సాధించింది డబుల్ బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. ఓవరాల్‌గా రూ. 21.72 కోట్ల థియేట్రికల్‌గా లాభాలను తీసుకొచ్చింది. (Twitter/Photo)
16. ధమాకా | రవితేజ హీరోగా నటించిన ‘ధమాకా’ సినిమా తెలుగులో రూ. 18.30 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. రూ. 19 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో బరిలో దిగిన ఈ చిత్రం ఓవరాల్‌గా రూ. 40 కోట్ల షేర్ (రూ. 75 కోట్ల గ్రాస్) వసూళ్లతో దుమ్ము దులుపింది. ఓవరాల్‌గా రూ. 20 కోట్ల వరకు లాభాలను తీసుకొచ్చింది. (Twitter/Photo)