Tollywood Top Disaster Movies | గత కొన్నేళ్లుగా టాలీవుడ్ సినిమాల బిజినెస్ పెరిగింది. అదే రీతిలో బడా హీరోల మార్కెట్ కూడా పెరిగింది. ఈ నేపథ్యంలో చాలా చిత్రాలు విడుదలకు ముందే రూ. వందల కోట్లలో ప్రీ రిలీజ్ బిజినెస్ చేస్తున్నాయి. గతేడాది ఎన్నో అంచనాల మధ్య విడుదలైన ‘రాధే శ్యామ్’ అంచనాలను అందుకోలేక చతికిల బడింది. ఆ తర్వాత చిరంజీవి, రామ్ చరణ్‌ల ‘ఆచార్య’ సినిమా కూడా మొదటి రోజు నుంచే డిజాస్టర్ టాక్ సొంతం చేసుకుంది. అటు విజయ్ దేవరకొండ లైగర్ కూడా బాక్సాఫీస్ దగ్గర చతికిలబడింది. గత కొన్నేళ్లుగా భారీ అంచనాలతో వచ్చిన చిత్రాలు డిజాస్టర్ కావడం ఎక్కువయ్యాయి. ఈ సినిమా బయ్యర్స్‌కు అత్యధిక నష్టాలు తీసుకొచ్చింది. ఓవరాల్‌గా బయ్యర్స్‌కు తీవ్ర నష్టాలు తీసుకొచ్చిన చిత్రాల విషయానికొస్తే.. (Twitter/Photo)
1. రాధే శ్యామ్ | ప్రభాస్ హీరోగా నటించిన ‘రాధే శ్యామ్’ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా 202 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లోనే రూ. 106 కోట్లు రాబట్టాలి. మరోవైపు హిందీలో రూ. 52.59 కోట్లకు అమ్మారు. కానీ లక్ష్యానికి రాధే శ్యామ్ దాదాపు రూ. 120 కోట్ల దూరంలో ఆగిపోయి టాలీవుడ్లో ఇప్పటి వరకు అన్ని రికార్డులను బ్రేక్ చేసి ఇప్పటి వరకు అతిపెద్ద డిజాస్టర్‌గా నిలిచింది రాధే శ్యామ్.(Twitter/Photo)
2. ఆచార్య | మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi ), రామ్ చరణ్ (Ram Charan)లు తొలిసారి పూర్తి స్థాయిలో కలిసి నటించిన సినిమా ‘ఆచార్య’ (Acharya ). కొరటాల శివ దర్శకత్వం వహించారు. అనేక వాయిదాల తర్వాత ఈ సినిమా గతేడాది ఏప్రిల్ 29వ తేదీన విడుదలై నెగిటిక్ టాక్ సొంతం చేసుకుంది. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 2 వేలకు పైగా స్క్రీన్స్‌లో విడుదలైంది. అంతేకాదు 132.50 కోట్ల టార్గెట్‌తో బాక్సాఫీస్ దగ్గర ఆచార్య బరిలో దిగింది. ఈ సినిమా మొత్తంగా రూ. 45 కోట్ల షేర్ రాబట్టింది. ఫైనల్‌గా ఈ సినిమా రూ. 84.14 కోట్ల నష్టాల పాలైంది. మొత్తంగా 2022లో రాధే శ్యామ్ తర్వాత రెండో బిగ్గెస్ట్ డిజాస్టర్ మూవీస్‌లో ఆచార్య నిలిచిపోయింది. అంతేకాదు ఓవరాల్‌గా టాప్ డిజాస్టర్ మూవీస్‌లో రెండో స్థానంలో ఉంది. Acharya Twitter
3. అజ్ఞాతవాసి | పవన్ కళ్యాణ్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘అజ్ఞాతవాసి’ మూవీ రూ. 70 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కింది. ఆ తర్వాత రూ. 123.60 కోట్లకు (అమ్మారు) ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. మొత్తంగా ఈ సినిమా రూ. 57.5 కోట్ల షేర్ మాత్రమే వసూలు చేసింది. మొత్తంగా ఈ సినిమా 66.10 కోట్ల నష్టాలను మిగిల్చింది. (Twitter/Photo)
4. లైగర్ : విజయ్ దేవరకొండ హీరోగా పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా భారీ అంచనాల మధ్య విడుదలై డిజాస్టర్ టాక్ సొంతం చేసుకుంది. లైగర్ మూవీ ప్రపంచ వ్యాప్తంగా అన్ని భాషల్లో రూ. 88.40 కోట్ల బిజినెస్ చేసింది. రూ. 90 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో బరిలో దిగింది.మొత్తంగా రూ. 28.20 కోట్ల షేర్ రాబట్టింది. మొత్తంగా ఈ సినిమా రూ. 61.80 కోట్ల థియేట్రికల్‌గా నష్టపోయింది. మొత్తంగా ఈ సినిమా కొన్నవాళ్లు మూడు రెట్ల నష్టపోయారు.మొత్తంగా 2022లో విడుదలైన చిత్రాల్లో అత్యధిక నష్టాలు తీసుకొచ్చిన చిత్రాల్లో ‘లైగర్’ మూవీ నిలిచింది.
5.స్పైడర్ | సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా తమిళ అగ్ర దర్శకుడు ఏ.ఆర్.మురుగదాస్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘స్పైడర్’ మూవీ మొత్తంగా 120 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కింది. ఈ సినిమాను తెలుగులో 106.3 కోట్లకు అమ్మారు. తమిళంలో రూ. 18కోట్లకు అమ్మారు. మొత్తంగా రెండు భాషల్లో రూ. 124.30 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. ఓవరాల్‌గా బాక్సాఫీస్ దగ్గర ఈ సినిమా రూ. 63.8 కోట్ల షేర్ సాధించింది. మొత్తంగా ఈ సినిమాను 60.50 కోట్ల నష్టాలను మిగిల్చింది.
6.సాహో | బాహుబలి సినిమా తర్వాత ప్రభాస్ హీరోగా సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘సాహో’. ఈ సినిమా మొత్తంగా రూ. 350 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కింది. ఈ సినిమాను రూ. 270.6 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. బాక్సాఫీస్ దగ్డర ఈ సినిమాను రూ. 219 కోట్ల షేర్ రాబట్టింది. మొత్తంగా ఈ సినిమా 52.15 కోట్ల నష్టాలను తీసుకొచ్చింది. (File/Photo)
7.ఎన్టీఆర్ కథానాయకుడు | నందమూరి బాలకృష్ణ కథానాయకుడిగా ఆయన తండ్రి పాత్రలో నటిస్తూ నిర్మిస్తూ క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ ‘ఎన్టీఆర్’. ఈ చిత్రాన్ని రెండు భాగాలుగా ‘ఎన్టీఆర్ కథానాయకుడు’.ఎన్టీఆర్ మహానాయకుడు’గా తెరకెక్కించారు. ఇక మొదటి భాగం కథానాయకుడుకు రూ. 50 కోట్ల బడ్జెట్‌తో భారీ తారగణంతో తెరకెక్కించారు. ఈ సినిమాను రూ. 70.5 కోట్లకు అమ్మారు. ఓవరాల్‌గా ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర రూ. 20.23 కోట్ల షేర్ మాత్రమే వసూళు చేసింది. ఈ సినిమా ఓవరాల్‌గా 50.27 కోట్ల నష్టాలను మిగిల్చింది. (Twitter/Photo)
9. సైరా నరసింహారెడ్డి | చిరంజీవి టైటిల్ రోల్లో అమితాబ్ బచ్చన్, సుదీప్, విజయ్ సేతుపతి, నయనతార, తమన్నా ముఖ్యపాత్రల్లో నటించిన సినిమా ‘సైరా నరసింహారెడ్డి’. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను రూ. 270 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కించారు. తెలుగులో రూ. 143 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. మిగిలిన అన్ని భాషల్లో కలిపి రూ. 44.25 కోట్ల కు అమ్మారు. మొత్తంగా రూ. 187.25 కోట్ల బిజినెస్ చేసింది. ఓవరాల్‌గా ఈ సినిమా రూ. 143.80 కోట్లు షేర్ రాబట్టింది. ఓవరాల్‌గా ఈ సినిమా రూ. 43.45 కోట్ల నష్టాలను తీసుకొచ్చింది. (Twitter/Photo)
10. నేనొక్కడినే - 1 | సూపర్ స్టార్ మహేష్ బాబు, సుకుమార్ కాంబినేషన్లో తెరకెక్కిన థ్రిల్లర్ మూవీ ‘నేనొక్కడినే’. థ్రిల్ చేసే కథాంశాలు ఉన్న ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో విఫలమైంది. ఈ సినిమాను రూ. 55 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కించారు. రూ. 72 కోట్లకు అమ్మారు. మొత్తంగా బాక్సాఫీస్ దగ్గర ఈ సినిమా రూ. 29.30 కోట్లు వసూళు చేసింది. మొత్తంగా ఈ సినిమా రూ. 42.70 కోట్ల నష్టాలను తీసుకొచ్చింది. (Twitter/Photo)
11. బ్రహ్మోత్సవం: మహేష్ బాబు హీరోగా శ్రీకాంత్ అడ్డాల తెరకెక్కించిన బ్రహ్మోత్సవం ఈ సినిమాను రూ. 45 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కింది.రూ. 75.60 కోట్లకు అమ్మారు. తమిళంలో రూ. 12.20 కోట్లుకు అమ్మారు. ఓవరాల్‌గా బాక్సాఫీస్ దగ్గర ఈ సినిమా రూ. 36.80 కోట్ల షేర్ తీసుకొచ్చింది. ఓవరాల్‌గా ఈ సినిమాను రూ. 38.80 కోట్ల నష్టాలను తీసుకొచ్చింది. (Twitter/Photo)
12.సర్ధార్ గబ్బర్ సింగ్ | పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా బాబీ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘సర్ధార్ గబ్బర్ సింగ్’. ఈ సినిమాను రూ. 32 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కించారు. ప్రీ రిలీజ్ బిజినెస్ మాత్రం రూ. 83.40 కోట్లు.. హిందీలో రూ. 6.20 కోట్లు.. ఓవరాల్‌గా బాక్సాఫీస్ దగ్గర రూ. 52.60 కోట్ల షేర్ రాబట్టింది. మొత్తంగా రూ. 37 కోట్ల నష్టాలను తీసుకొచ్చింది. (Twitter/Photo)
13. అఖిల్ | అక్కినేని నాగార్జున తనయుడు హీరోగా నటించిన తొలి చిత్రం ‘అఖిల్’. వి.వి.వినాయక్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం రూ. 42.50 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. అమ్మింది రూ. 48.50 కోట్లుకు అమ్మారు. ఓవారల్‌గా బాక్సాఫీస్ దగ్గర ఈ సినిమా రూ. 20.20 కోట్ల షేర్ రాబట్టింది. ఓవరాల్‌గా ఈ సినిమా 28.30 కోట్ల నష్టాలను తీసుకొచ్చింది. (Twitter/Photo)
14.కొమరం పులి: పవన్ కళ్యాణ్ నటించిన కొమరం పులి పదేళ్ల కిందే ఎన్నో కోట్ల నష్టాలు తీసుకొచ్చింది.రూ. 45 కోట్ల బడ్జెట్‌తో ఈ సినిమాను తెరకెక్కించారు. అమ్మింది రూ. 45 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. బాక్సాఫీస్ దగ్గర ఈ సినిమా రూ. 18.30 కోట్ల షేర్ తీసుకొచ్చింది. ఓవరాల్‌గా ఈ సినిమా రూ. 26.70 కోట్ల నష్టాలను తీసుకొచ్చింది. (File/Photo)
15. వినయ విధేయ రామ: రంగస్థలం లాంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత రామ్ చరణ్ హీరోగా నటించిన సినిమా.. పైగా బోయపాటి శ్రీను దర్శకుడు కావడంతో వినయ విధేయ రామపై అంచనాలు చాలానే ఉన్నాయి. ఈ సినిమాను రూ. 60 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కించారు. ఈ సినిమాను రూ. 90 కోట్లకు అమ్మారు. ఓవరాల్‌గా బాక్సాఫీస్ దగ్గర ఈ సినిమా 63.4 కోట్ల షేర్ రాబట్టింది. మొత్తంగా ఈ సినిమా రూ. 26.60 కోట్ల నష్టాలను తీసుకొచ్చింది. (Twitter/Photo)
16. మగధీర ఇండస్ట్రీ హిట్ తర్వాత రామ్ చరణ్ హీరోగా బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘ఆరెంజ్’. నాగబాబు అంజనా ప్రొడక్షన్స్ బ్యానర్లో తెరకెక్కించిన ఈ సినిమాను రూ. 46 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కించారు. రూ. 46.50 కోట్లకే అమ్మారు. బాక్సాఫీస్ దగ్గర ఈ సినిమా 20.10 కోట్ల షేర్ రాబట్టింది. ఓవరాల్‌గా ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర రూ. 26.40 కోట్ల నష్టాలను తీసుకొచ్చింది. (Twitter/Photo)
17. తుఫాన్: అప్పటి వరకు వరస విజయాలతో దూసుకుపోతూ మినిమమ్ గ్యారెంటీ హీరోగా ఉన్న రామ్ చరణ్.. తుఫాన్ సినిమాతో చెత్త రికార్డ్ అందుకున్నాడు. ఈ చిత్రం దారుణమైన నష్టాలు తీసుకొచ్చింది. ఈ సినిమాను రూ. 42 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కించారు. రూ. 36.20 కోట్లకు అమ్మారు. బాక్సాఫీస్ దగ్గర రూ. 11.20 కోట్ల షేర్ రాబట్టింది. ఓవరాల్‌గా ఈ సినిమా రూ. 25 కోట్ల నష్టాలను తీసుకొచ్చింది. (Twitter/Photo)
18. బ్రూస్లీ | రామ్ చరణ్ హీరోగా శ్రీను వైట్ల దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ ‘బ్రూస్లీ. ’ ఈ చిత్రాన్ని రూ. 50 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కించారు. రూ. 65 కోట్లకు అమ్మారు. బాక్సాఫీస్ దగ్గర ఈ సినిమా రూ. 40 కోట్ల షేర్ రాబట్టింది. మొత్తంగా ఈ సినిమాను రూ. 25 కోట్ల నష్టాలను తీసుకొచ్చింది. (Twitter/Photo)
19. కాటమ రాయుడు | పవన్ కళ్యాణ్ హీరోగా కిశోర్ షార్ధసాని (డాలీ) దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ ‘కాటమరాయుడు’. ఈ సినిమాను రూ. 30 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కించారు. రూ. 87.5 కోట్లకు అమ్మారు. బాక్సాఫీస్ దగ్గర ఈ సినిమా రూ. 62.5 కోట్ల షేర్ రాబట్టింది. మొత్తంగా రూ. 25 కోట్ల నష్టాలను తీసుకొచ్చింది. (Twitter/Photo)
20. లై | నితిన్ హీరోగా అర్జున్ ప్రతి నాయకుడిగా హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ ‘లై’. ఈ సినిమాను రూ. 35 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కించారు. రూ. 34 కోట్లకు అమ్మారు. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర రూ. 10 కోట్ల షేర్ మాత్రమే రాబట్టింది. ఓవరాల్‌గా ఈ సినిమా రూ. 24 కోట్ల నష్టాలను తీసుకొచ్చింది. (Twitter/Photo)
21. ఓం నమో వేంకటేశాయ | అక్కినేని నాగార్జున కథానాయకుడిగా కే.రాఘవేంద్రరావు దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ ‘ఓం నమో వేంకటేశాయ’. రూ. 25 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ మూవీని రూ. 33.6 కోట్లకు అమ్మారు. బాక్సాఫీస్ దగ్గర ఈ సినిమా రూ. 10 కోట్ల షేర్ మాత్రమే రాబట్టింది. ఓవరాల్‌గా ఈ సినిమా రూ. 23.6 కోట్ల నష్టాలను తీసుకొచ్చింది. (File/Photo)
22. ఇంటిలిజెంట్: సాయి ధరమ్ తేజ్ ఇలాంటి ఓ సినిమా చేసాడని కూడా చాలా మందికి తెలియదు. వినాయక్ తెరకెక్కించిన ఈ చిత్రాన్ని రూ. 20 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కించారు. రూ. 27 కోట్లకు అమ్మారు. ఫుల్ రన్లో కేవలం 3.8కోట్లు మాత్రమే తీసుకొచ్చి.. దాదాపు 90 శాతం రూ. 23.2 కోట్ల నష్టాలు మిగిల్చింది డిస్ట్రిబ్యూటర్లకు. (File/Photo)
23.శక్తి: | మెహర్ రమేష్ తెరకెక్కించిన ఈ చిత్రం తెచ్చిన నష్టాల నుంచి బయట పడటానికి అశ్వినీ దత్ లాంటి అగ్ర నిర్మాతకు కూడా ఏడేళ్లు పట్టిందంటే శక్తి షాక్ అర్థం చేసుకోవచ్చు. జూనియర్ కెరీర్లో ఇదే బిగ్గెస్ట్ డిజాస్టర్.ఈ సినిమా రూ. 45 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కించారు. ఈ సినిమాను రూ. 42 కోట్లకు అమ్మారు. ఓవరాల్‌గా బాక్సాఫీస్ దగ్గర ఈ సినిమా రూ. 19.50 కోట్ల షేర్ రాబట్టింది. మొత్తంగా రూ. 22.50 కోట్ల నష్టాలను మిగిల్చింది.
24. పరమవీరచక్ర | ‘సింహా’ వంటి బ్లాక్ బస్టర్ సక్సెస్ తర్వాత నందమూరి బాలకృష్ణ.. దర్శకరత్న దాసరి నారాయణ రావు దర్శకత్వంలో చేసిన మూవీ ‘పరమవీరచక్ర’. ఈ సినిమాలో బాలకృష్ణ.. రెండు విభిన్న పాత్రల్లో నటించారు. ఈ సినిమాను రూ. 25 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కించారు. రూ. 26 కోట్లకు అమ్మారు. ఓవరాల్‌గా రూ. 3.80 కోట్లు మాత్రమే వసూళు చేసింది. ఓవరాల్‌గా ఈ సినిమా రూ. 22.20 కోట్ల నష్టాలను తీసుకొచ్చింది. (Twitter/Photo)
27. రామయ్యా వస్తావయ్యా | ఎన్టీఆర్, హరీష్ శంకర్ కాంబినేషన్లో తెరకెక్కిన మూవీ ‘రామయ్య వస్తావయ్యా’. ఈ సినిమాను రూ. 40 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కించారు. రూ. 54 కోట్లకు అమ్మారు. మొత్తంగా బాక్సాపీస్ దగ్గర ఈ సినిమా రూ. 32 కోట్ల షేర్ వసూళు చేసింది. ఓవరాల్‌గా ఈ సినిమా రూ. 22 కోట్లకు పైగా నష్టాలను తీసుకొచ్చింది.