ఇప్పుడు సైతం ఇలాంటి విషయమే బయటికి వచ్చింది. ఎన్నో ఏళ్లుగా తాను బాధపడుతున్న ఒక వ్యాధి గురించి అభిమానులకు చెప్పుకొని షాక్ ఇచ్చింది సుమ. ఈ విషయం తెలిసిన తర్వాత అంతా ముక్కున వేలేసుకుంటున్నారు. ఇన్నేళ్ళుగా వ్యాధితో బాధ పడుతున్నా కూడా ఒక్కసారి కూడా అనుమానం రాకుండా కవర్ చేసిందా అంటూ ఆశ్చర్యపోతున్నారు అభిమానులు.
సుమకు కీలాయిడ్ టెండెన్సీ అనే స్కిన్ ఇన్ఫెక్షన్ ఉంది. కొన్నేళ్లుగా ఈ వ్యాధితో బాధ పడుతున్నట్లు తెలిపింది సుమ. ఈ వ్యాధి ఉన్నవాళ్ళకు చర్మంపై చాలా సమస్యలు వస్తుంటాయి. ఏదైనా చిన్న దెబ్బ తగిలినా కూడా అది మరింత పెద్దదే అవుతుంది కానీ తగ్గదు. ఈ వ్యాధి ముఖ్య లక్షణం కూడా ఇదే. ముఖ్యంగా యాంకరింగ్ ఫీల్డ్‌లో ఉండే సుమకు ఈ వ్యాధి రావడం మరింత ఆందోళనకరమే.
ఈ సమస్యని పోగొట్టుకోవడానికి చాలా ప్రయత్నించినా కూడా కుదర్లేదని చెప్పుకొచ్చింది సుమ. యాంకరింగ్ మొదలు పెట్టిన కొత్తల్లో ముఖానికి మేకప్ ఎలా వేసుకోవాలి.. ఎలా తీసేయాలి లాంటివి తెలియక జరగాల్సిన నష్టం జరిగిపోయిందని బాధ పడింది సుమ. ఇప్పుడు ఉన్నదాన్ని కాపాడుకోవడం తప్ప తన చేతుల్లో ఏమీ లేదని బాధ పడింది సుమ. ఈమెకు ఈ వ్యాధి ఉందని తెలిసిన తర్వాత అంతా షాక్ అవుతున్నారు.