యాంకర్ శ్రీముఖి గురించి కొత్తగా ఏం చెప్పాలి..? స్టార్ యాంకర్‌గా చక్రం తిప్పుతుంది ఈమె. పైగా బిగ్ బాస్ పుణ్యమా అని మరింత క్రేజ్ తెచ్చుకుంది కూడా. ఈ షో తర్వాత మరోసారి కెరీర్‌పై ఫోకస్ చేసింది. రియాలిటీ షోలతో పాటు అప్పుడప్పుడూ సినిమాలు కూడా చేస్తుంది శ్రీముఖి. ఇన్ని చేస్తూ కూడా సోషల్ మీడియాలో బిజీగా ఉంటుంది శ్రీముఖి. ఇదిలా ఉంటే ఇప్పుడు తన పెళ్లి గురించి మనసులో మాట బయట పెట్టింది శ్రీముఖి.
తన దృష్టిలో ప్రేమ అంటే మంచి ఎమోషన్ అంటుంది శ్రీముఖి. ఒకప్పుడు తాను రిలేషన్ షిప్లో ఉన్నా కూడా అవన్నీ మంచివే అని చెప్పలేమని కొట్టి పారేసింది. ఇప్పుడు అవి గుర్తు చేసుకోలేను అంటుంది ఈ ముద్దుగుమ్మ. బిగ్ బాస్‌లో ఉన్నపుడు తాను ఒకర్ని ప్రేమించి మోసపోయానని చెప్పుకొచ్చింది శ్రీముఖి. భవిష్యత్తులో కూడా తాను ప్రేమ పెళ్లే చేసుకుంటానని చెప్పింది ఈ ముద్దుగుమ్మ. వన్ టైమ్ కమిట్మెంట్ ఉంటేనే అది లవ్ అంటుంది ఈ భామ.
అది భర్తతోనే ఉండాలని.. చివరి వరకు ఆ వ్యక్తితోనే ఉండటాన్నే ప్రేమ అంటారని చెప్పింది ఈ బ్యూటీ. అయితే పెళ్లికి ముందు కొన్ని చేయాలని ఫిక్సైపోయింది ఈ బ్యూటీ. తన ఫీలింగ్స్ అన్నీ తన వరకే ఉంటాయని.. ఒకరిపై ఎమోషనల్‌గా డిపెండ్ అయిపోనని చెప్పుకొచ్చింది శ్రీముఖి. గతం నేర్పిన అనుభవాల నుంచి ఈ భావనలు వచ్చాయేమో అంటుంది ఈ ముద్దుగుమ్మ.
ప్రస్తుతం చాలా పనులతో బిజీగా ఉన్నానని.. అందుకే ప్రేమ, పెళ్లి గురించి ఆలోచించే అవసరం రాలేదని చెప్పుకొచ్చింది. మరో రెండేళ్ల వరకు కూడా పెళ్లి చేసుకోకూడదని ఫిక్సైపోయానని చెప్పింది ఈమె. ఇంట్లో వాళ్లు కూడా తన పెళ్లి గురించి ఆలోచించడం లేదని.. ఎలాంటి ఒత్తిడి పెట్టడం లేదని కూడా చెప్పుకొచ్చింది. పెళ్లి తర్వాత లైఫ్ మొత్తం ఫ్యామిలీ, భర్త, పిల్లలకే అంకితం చేయాలని అనుకుంటున్నట్లు చెప్పింది శ్రీముఖి.
అంటే పెళ్లైతే కెరీర్‌కు ఫుల్ స్టాప్ పెడతానని ముందుగానే చెప్పేస్తుంది శ్రీముఖి. ఇదే విషయం క్యాష్ కార్యక్రమంలో కూడా చెప్పుకొచ్చింది శ్రీముఖి. తన యిష్టాన్ని నాన్న ఎక్కువగా నమ్ముతారని.. గౌరవిస్తారని.. తన కుటుంబం వైపు నుంచి ఎలాంటి అభ్యంతరాలు ఉండవని చెప్పుకొచ్చింది శ్రీముఖి. అందుకే ప్రేమించి పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకుంటానని క్లారిటీ ఇచ్చింది.
కానీ పెళ్లికి ముందే ఆర్థికంగా సెటిల్ అవ్వాలని.. ఆ ఒక్కటి చేసిన తర్వాతే పెళ్లి చేసుకుంటానని చెప్తుంది శ్రీముఖి. ఇదిలా ఉంటే తాజాగా ఫేస్ బుక్‌లో ఈ అమ్మడు ఈ వాలెంటైన్స్ డే చాలా స్పెషల్ అంటూ పోస్ట్ చేసింది. ఈ డేట్ గుర్తు పెట్టుకోండి.. తప్పకుండా దీని గురించి తర్వాత మాట్లాడుదాం అంటూ పోస్ట్ చేసింది. అదే సమయంలో ఆమె రెడ్ రోజెస్ చేతుల్లో పట్టుకుంది శ్రీముఖి.