Tollywood Tier 2 Heroes First Day Openings : నాని హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘దసరా’. ఈ మూవీ ఫస్ట్ డే మంచి టాక్‌తో దూసుకుపోతుంది. ఈ సినిమా మొదటి రోజు మంచి వసూళ్లనే రాబట్టింది. తెలుగులో మీడియం రేంజ్ హీరోల్లో ఫస్ట్ డే అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాల్లో ఫస్ట్ ప్లేస్‌లో నిలిచింది. మొత్తంగా టైర్ 2 హీరోల్లో అత్యధిక వసూళ్లను సాధించిన టాప్ సినిమాల విషయానికొస్తే..
11. నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా కొత్త దర్శకుడు మల్లిడి వశిష్ఠ్ దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ ‘బింబిసార’. ఈ సినిమా తొలి రోజు రూ. 6.30 కోట్లు వసూళు చేసింది. ఈ సినిమా కళ్యాణ్ రామ్ కెరీర్లో అత్యధిక వసూళ్లను సాధించిన సినిమాగా రికార్డులకు ఎక్కింది. టైర్ 2 హీరోల సినిమాల్లో మొదటి రోజు అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాల్లో 11వ స్థానంలో నిలిచింది. (Twitter/Photo)