Tollywood Thatha Manavallu : ఏ ఇండస్ట్రీ తీసుకున్న ఏమున్నది గర్వకారణం...సినిమా ఇండస్ట్రీ సమస్తం వారసత్వ పరాయణత్వం. ప్రస్తుతం అన్ని ఫిల్మ్ ఇండస్ట్రీస్‌ల్లో వారసులదే హవా నడుస్తోంది. ఒక తరం నటులు సంపాదించిన ఇమేజ్‌తో.. తరతరాలుగా నట వారసత్వాన్ని కొనసాగిస్తున్నారు. తమ వారసులకు మీసం మొలకెత్తడమే లేటు.. కావాల్సిన ప్లాట్‌ఫాం క్రియేట్ చేసి పెడుతున్నారు. తాతలు, తండ్రులు సంపాదించిన ఇమేజ్ ను ఇన్వెస్ట్ చేసి హీరోలుగా రాణిస్తున్నారు. తాాజాగా అలనాటి హీరో హరనాథ్ మనవడు కథానాయకుడిగా టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నారు. మొత్తంగా టాలీవుడ్లో హీరోలుగా ఎంట్రీ ఇచ్చిన మనవళ్లపై న్యూస్ 18 స్పెషల్ ఫోకస్.. (File/Photo)
ఫిల్మ్ ఇండస్ట్రీల వారసత్వ హీరోయిజం ఎప్పటి నుంచో నడుస్తుంది. అది సెకండ్ జనరేషన్ దాటి.. థార్డ్ జనరేషన్‌లోకి ఎంటరైంది. ప్రస్తుతం..కొడుకుల జమానా పోయి మనవళ్ల హవా నడుస్తోంది. తాతలకు, తండ్రులకు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్.. ఈ పడుచు హీరోలకు ప్లస్ అవుతోంది. వాళ్లు సినిమాల్లో ఎంట్రీ ఇవ్వకముందే.. మీడియా కావాల్సినంత ఫ్రీ పబ్లిసిటీ ఇస్తుంది. ఇలా రావడం.. అలా స్టార్ ఇమేజ్ కొట్టేయడం.. ఫార్ములా వెరీ సింపుల్‌గా మారింది. (File/Photo)
ఇక తాత ఇమేజ్.. మనవడి కవరేజ్ విషయంలో .. పెద్ద ఎన్టీఆర్ మనవళ్ల లిస్ట్ చాలా పెద్దదే. అందులో ముందుగా చెప్పుకోవాల్సింది జూనియర్ ఎన్టీఆర్ గురించే. తాత ఎన్టీఆర్ పోలికలతో పాటు.. నట వారసత్వాన్ని కూడా అంది పుచ్చుకుని టాలీవుడ్ యంగ్ టైగర్‌గా మంచి టెంపర్ మీదున్నారు. దివంగత ఎన్టీఆర్ నట వారసులుగా వచ్చిన మనవళ్లల్ల ఎవరికీ లేనంత ఇమేజ్ ఒక్క తారక్ కే సొంతమైంది. (File/Photo)
గత కొన్నేళ్లుగా ఎన్టీఆర్ వారసుడిగా రాబోతున్న మరో మనవడు.. మోక్షఙ్ఞ. నూనూగు మీసాల ఇతను బాలకృష్ణ ఒక్కనొక్క కుమారుడు. హీరోగా మోక్షజ్ఞను తెరకు పరిచయం చేసేందుకు.. అప్పుడే అన్ని ప్రయత్నాలు మొదలయ్యాయి. ఇప్పటికే యాక్టింగ్ స్కిల్స్ కోసం..స్పెషల్‌గా ట్రెయిన్ అవుతున్నాడు. అంతేకాదు ఆదిత్య 999 మాక్స్ మూవీతో హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నట్టు స్వయంగా బాలయ్య ప్రకటించారు. (File/Photo)
ఒకప్పటి డైరెక్టర్, ప్రొడ్యూసర్ అయిన సూర్య ప్రకాశ్ రావు వారసుడు.. కె.రాఘవేంద్రరావు. ఆయన తనయడు పేరు కూడా సూర్య ప్రకాశ్ రావే. తాత క్రియేట్ చేసిన ప్లాట్ ఫాం, తండ్రి ఇమేజ్ను ఇన్వెస్ట్ చేసి..‘నీతో’ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చారు. అలా కథానాయకుడిగా ఎంట్రీ ఇచ్చిన ప్రకాశ్ ఆడియెన్స్ ను ఇంప్రెస్ చేయలేకపోయారు. అందుకే తాత, తండ్రికి కలిసొచ్చిన డైరెక్షనే చేస్తున్నారు. (File/Photo)