Mahesh Babu on OTT: ప్రస్తుతం పెద్ద పెద్ద స్టార్ హీరోల సినిమాలు వరుసగా షూటింగ్ బిజీలో ఉన్నాయి. కానీ అసలు సమస్య.. ఎక్కడ విడుదల చేయాలనేది ప్రశ్నగా మిగిలిపోతుంది నిర్మాతలకు. కొన్ని సినిమాలు మాత్రం ఓటీటీ లో విడుదల అవుతున్నాయి. ఈ నేపథ్యంలో మహేష్ బాబు కొన్ని విషయాలు పంచుకున్నాడు. తను నటిస్తున్న సినిమాలన్ని థియేటర్లోనే చూసేందుకు తెరకెక్కిస్తున్నామని తెలిపాడు. ప్రేక్షకులను, తన అభిమానులను థియేటర్లకు దూరం చేయనని.. అది ఒక సామ్రాజ్యమని క్లారిటీ ఇచ్చాడు. ఇక ఓటీటీ ఫ్లాట్ ఫామ్ కి మాత్రం రెస్పెక్ట్ ఇస్తాను అంటూ.. అది ఒక ప్రత్యేక సంస్థ అని.. ఓటీటీ గురించి కుండ బద్దలు కొట్టినట్లు సమాధానమిచ్చాడు.