Singer Sunitha: ఏమైంది ఈ వేళ పాటతో అందరిని మాయ చేసింది సింగర్ సునీత. తన పాటల, మాటల గురించి ఎంత చెప్పిన తక్కువే. ఎన్నో పాటలు పాడి మంచి గుర్తింపు తెచ్చుకుంది సునీత. ఒంటరి జీవితాన్ని గడిపిన సునీత కొన్ని రోజుల కిందట రెండో పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. ఇక సోషల్ మీడియాలో కూడా బాగా యాక్టివ్ గా మారింది. తన భర్తతో దిగిన ఫోటోలను బాగా షేర్ చేసుకుంటుంది. తాజాగా తన ఇన్ స్టా వేదికగా ఓ ఫోటో షేర్ చేసుకుంది. ఇక అందులో లేటు వయసులో కూడా ఎంతో అందంగా కనిపిస్తుంది. ఇక ఈ ఫోటోకు తెగ లైక్స్ తో పాటు.. చిన్న పిల్లగా మారిపోయిందని, ఎంత క్యూట్ గా చూస్తుందోనని కామెంట్స్ చేస్తున్నారు అభిమానులు.