Singer Sunitha: టాలీవుడ్ సింగర్ సునీత పరిచయం గురించి, తన పాటల గురించి అందరికీ తెలిసిందే. ఎన్నో సినిమాలలో ఎన్నో పాటలు పాడి మంచి గుర్తింపు తెచ్చుకుంది. అంతేకాకుండా డబ్బింగ్ ఆర్టిస్ట్ గా కూడా మంచి పేరు సంపాదించుకుంది. గులాబీ, ఎగిరే పావురమా సినిమాలో తొలిసారిగా పాటలు పాడి మంచి సక్సెస్ అందుకుంది. బుల్లితెరలో కూడా పలు షోలలో చేసింది. ఇక తను రెండో పెళ్లి చేసుకున్న సంగతి అందరికీ తెలిసిందే. ఈమధ్య సోషల్ మీడియాలో బాగా సందడి చేస్తుంది. నిత్యం తన ఫోటోలను అభిమానులతో పంచుకుంటుంది. తాజాగా తన ఇన్ స్టాలో కొన్ని ఫోటోలు పంచుకోగా అందులో తను మైక్ పట్టుకొని పాడుతున్నట్లు కనిపించింది. తన ఎనర్జీ సీక్రెట్ గురించి ఓ విషయాన్ని పంచుకుంది. ఇంతకీ అదేంటంటే.. తను పాటలు పాడటమే తన ఎనర్జీ సీక్రెట్ అని తెలిపింది.