Singer Sunitha: టాలీవుడ్ సింగర్ సునీత గురించి, తన పాటల గురించి అందరికీ తెలిసిందే. ఏమైంది ఈ వేళ పాటతో తెలుగు ప్రేక్షకుల హృదయాలను దోచుకున్న సునీత ఎన్నో పాటలు పాడి మంచి పేరు సంపాదించుకుంది. కొన్ని నెలల క్రితమే రెండో పెళ్లి చేసుకున్న సునీత తన కొత్త జీవితాన్ని సంతోషంగా గడుపుతుంది. ఇక సోషల్ మీడియాలో కూడా ఎప్పుడు యాక్టీవ్ గా ఉండే సింగర్ సునీత తన ఫోటోలను నిత్యం పంచుకుంటుంది. తాజాగా సోషల్ మీడియా వేదికగా ఓ ఫోటో పంచుకోగా అందులోమెరిసిపోతుంది. ఈ ఫోటోలను చుసిన సింగర్ సునీత అభిమానులు ''రోజులు మారే కొద్దీ అందరికీ కి వయసు మాత్రమే పెరుగుద్ది. కానీ, అదేంటో కానీ మా సునీత గారికి అందం మాత్రమే పెరుగుతుంటుంది'' అంటూ కామెంట్ చెయ్యగా అది వైరల్ గా మారింది.