Singer Sunitha: టాలీవుడ్ సింగర్ సునీత పరిచయం గురించి అందరికీ తెలిసిందే. ఏమైంది ఈ వేళ పాటతో అందరి మనసులను దోచుకున్న సునీత.. ఎన్నో పాటలు పాడి మంచి గుర్తింపు తెచ్చుకుంది. తన డబ్బింగ్ వాయిస్ తో కూడా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. ఇప్పటికీ తన పాటలతో అలరిస్తూనే ఉంది. కొన్ని రోజుల కిందట సునీత రెండో పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. ఇక సోషల్ మీడియాలో కూడా బాగా యాక్టివ్ గా మారింది. తన భర్తతో దిగిన ఫోటోలను పంచుకుంటుంది. అభిమానులతో కూడా ముచ్చటిస్తుంది. ప్రస్తుతం బుల్లితెరలో ఓ షోలో జడ్జిగా చేస్తూ అభిమానులకు మరింత దగ్గరగా ఉంది.