TOLLYWOOD STAR PRODUCER DIL RAJU WENT TO HONEYMOON AND USED COVID BREAK LIKE THIS PK
Dil Raju: కరోనా సమయంలో దిల్ రాజు హనీమూన్.. భార్యతో ఆ దేశానికి వెళ్లిన అగ్ర నిర్మాత..
Dil Raju: తెలుగు ఇండస్ట్రీలో ఎప్పుడూ బిజీగా ఉండే నిర్మాతల్లో దిల్ రాజు(Dil Raju) ముందు వరసలో ఉంటారు. ఇంత బిజీగా ఉండటంతో పెళ్లి చేసుకున్న తర్వాత ఎక్కడికి వెళ్లలేకపోయారు ఈయన. ఇన్నాళ్ళకు తీరిక దొరకడంతో భార్యతో కలిసి హనీమూన్ లాంటి ట్రిప్ వెళ్లిపోయారు దిల్ రాజు.
తెలుగు ఇండస్ట్రీలో ఎప్పుడూ బిజీగా ఉండే నిర్మాతల్లో దిల్ రాజు ముందు వరసలో ఉంటారు. ఎప్పుడూ ఈ ప్రొడక్షన్ హౌజ్లో అరడజన్ సినిమాలు నిర్మాణంలోనే ఉంటాయి. ఇప్పుడు కూడా ఇదే జరుగుతుంది. అయితే కరోనా కారణంగా ఉన్న సినిమాల షూటింగ్స్ అన్నీ వాయిదా పడ్డాయి.
2/ 8
దాంతో ఈయనకు చాలా కాలం తర్వాత తీరిక దొరికింది. దాంతో భార్యతో కలిసి అమెరికా వెళ్లిపోయారు దిల్ రాజు. దేశంలో కరోనా సెకండ్ వేవ్ దారుణంగా ఉండటంతో కొన్ని రోజులు ఈయన అలా ప్లాన్ చేసారు. వకీల్ సాబ్ సమయంలో దిల్ రాజుకు కూడా కరోనా వచ్చింది.
3/ 8
కొన్ని రోజులు క్వారంటైన్లో ఉన్న తర్వాత నెగిటివ్ వచ్చింది. పూర్తిగా కోలుకున్న తర్వాత అమెరికా వెళ్లారు ఈయన. గతేడాది లాక్డౌన్ సమయంలోనే తేజస్వినిని పెళ్లి చేసుకున్నారు దిల్ రాజు. ఈయన మొదటి భార్య అనిత మూడేళ్ల కింద చనిపోయారు.
4/ 8
ఆ తర్వాత సన్నిహితుల సలహా మేరకు ఆయన రెండో పెళ్లి చేసుకున్నారు. అయితే పెళ్లి తర్వాత కూడా లాక్ డౌన్ ఉండటంతో ఎక్కడికి వెళ్లలేకపోయారు. దాంతో పాటు సినిమాలతోనూ బిజీగా ఉన్నారు. దాంతో ఎక్కడికి వెళ్లలేకపోయారు.
5/ 8
అయితే చాలా రోజులుగా ఆయన భార్యతో బయటికి వెళ్లాలని ట్రిప్ ప్లాన్ చేస్తూనే ఉన్నారు. సమయం దొరక్క కొన్ని రోజులు.. కరోనా కారణంగా మరికొన్ని రోజులు ఎక్కడికి వెళ్లలేదు. ఇన్నాళ్లకు బయట ఉన్న ప్రతికూల పరిస్థితులు ఈయనకు అనుకూలంగా మారాయి.
6/ 8
దాన్ని యూజ్ చేసుకున్నారు దిల్ రాజు. పక్కాగా ప్లాన్ చేసుకుని మూడు వారాల పాటు అమెరికా టూర్ వెళ్లిపోయారు. దిల్ రాజు కూతురు అక్కడే ఉంటారు. ఇప్పుడు కూతురు దగ్గరికే వెళ్లిపోయారు ఈయన. కొన్ని రోజులుగా ఇండియాకు ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ కూడా రద్దు చేయాలని భావిస్తున్నాయి కొన్ని దేశాలు.
7/ 8
అది అమల్లోకి రాకముందే చాలా మంది ఫారెన్ టూర్ వెళ్లేవాళ్లు ముందుగానే ప్లాన్ చేసుకున్నారు. దిల్ రాజు కూడా ఇలాగే చేసారు. ఏదేమైనా కూడా కరోనా సెకండ్ వేవ్ ఈయనకు అలా ఉపయోగపడిందన్నమాట.
8/ 8
ప్రస్తుతం ఈయన నిర్మాణంలో నాగ చైతన్య థ్యాంక్ యూ.. పాగల్.. రౌడీ బాయ్స్.. ఎఫ్ 3 లాంటి సినిమాలు వస్తున్నాయి. 2021లో ఇప్పటికే ఈయన వకీల్ సాబ్, షాదీ ముబారక్ సినిమాలను విడుదల చేసారు.