Samantha Akkineni: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తన నటనతో ఎంతో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈమె.. మరోవైపు బిజినెస్ లలో కూడా బాగా బిజీగా ఉంటుంది. ఏం మాయ చేశావే సినిమాతో తొలిసారిగా తెలుగు ప్రేక్షకుల మనసులను దోచుకున్న సమంత.. తర్వాత స్టార్ హీరోల సరసన నటించి స్టార్ హీరోయిన్ గా నిలిచింది. ఇక మరోవైపు సోషల్ మీడియాలో తన ఫోటోలతో అందరిని ఆకట్టుకుంటుంది. నిత్యం ట్రెండ్ ఫాలో అవుతూ..తన క్లాత్ బిజినెస్ సాకీ డిజైన్ వస్త్రాలను తానే ప్రమోట్ చేస్తూ పరిచయం చేస్తుంది. తాజాగా తన సోషల్ మీడియా వేదికగా ఓ ఫోటో పంచుకోగా.. అందులో తన సాకీ డిజైన్ కు సంబంధించిన డ్రెస్ ను ధరించి అందమైన స్మైల్ తో బాగా ఆకట్టుకుంది.