Pooja Hegde: టాలీవుడ్ బుట్టబొమ్మ పూజ హెగ్డే గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రస్తుతం అరడజన్ సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్న ఈ బ్యూటీ క్షణం తీరికలేకుండా షూటింగ్ లో పాల్గొంటుంది. ఇంకా అంత బిజీగా ఉన్న సోషల్ మీడియాలో రచ్చ రచ్చ చేస్తుంది ఈ ముద్దుగుమ్మ. లేటెస్ట్ ఫోటో షూట్ చేస్తూ అభిమానులకు దగ్గరగా ఉంటుంది. అయితే ఈ బ్యూటీ అప్పుడప్పుడు కొన్ని లీక్స్ కూడా చేస్తుంటుంది.. గతంలో ఆచార్య సినిమాలో పూజ హెగ్డే ఉన్నట్టు స్టోరీ పెట్టి డైరెక్టర్ కంటే ముందే విషయాన్నీ చెప్పేసింది. ఇప్పుడు రాధే శ్యామ్ సినిమాలో పూజ హెగ్డే తన లుక్ ని.. ''డైరెక్టర్ రాధాకృష్ణకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్తున్నట్టే చెప్పి.. సినిమాలోని మెయిన్ లుక్''ని రివీల్ చేసింది ముద్దుగుమ్మ. దీంతో ఈ లుక్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.