Kajal Aggarwal: టాలీవుడ్ గ్లామర్ బ్యూటీ స్టార్ నటి కాజల్ అగర్వాల్. తన నటనకు మంచి గుర్తింపు తెచ్చుకొని వరుస సినిమాల అవకాశాలతో స్టార్ హీరోల సరసన నటించింది. ఇక ప్రస్తుతం వరుస ప్రాజెక్టులతో బాగా బిజీగా ఉంది. ఇక ఈమె గత ఏడాది తన చిన్ననాటి స్నేహితుడు గౌతమ్ కిచ్లూను ప్రేమించి పెళ్లి చేసుకుంది. పెళ్లి తర్వాత కూడా తన అందాలను తెగ ఆరబోస్తుంది. సోషల్ మీడియాలో కూడా నిత్యం ఫోటోలను పంచుకుంటూ బాగా సందడి చేస్తుంది. తాజాగా తన ఇన్ స్టా వేదికగా కొన్ని ఫోటోలు పంచుకుంది. అందులో చేతికి గోరింటాకు పెట్టుకొని ఆభరణాలు ధరించుకుంటూ ఉయ్యాలలో కూర్చొని కనిపించింది. తనతో పాటు తన కుటుంబసభ్యులు కూడా ఉండగా ఏదో సెలబ్రేషన్స్ అన్నట్లు కనిపించింది. ఇక ఈ ఫోటోలను చూసిన నెటిజన్లు కాజల్ గర్భవతి అయిందా అందుకేనా ఈ సెలబ్రేషన్స్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.