Bimbisara Pre Release Theatrical Business : నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘బింబిసార’. హిట్ ఫ్లాపులకు సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేస్తూ వెళుతున్నారు. తాజాగా ఈయన టైటిల్ రోల్ ప్లే చేస్తూ చేసిన సినిమా ‘బింబిసార’. గత శుక్రవారం ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన ఈ సినిమాకు అన్ని ఏరియాల్లో పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. .(Twitter/Photo)
పీరియాడిక్, సైన్స్ ఫిక్షన్ జానర్లో వస్తున్న ఈ సినిమాకు కీరవాణితో పాటు చిరంతన్ భట్ సంగీతం అందిస్తున్నారు. వశిష్ట్ ఈ (Bimbisara) సినిమాకు దర్శకత్వం వహించారు. ఎన్టీఆర్ ఆర్ట్స్ పతాకంపై ఈ సినిమా తెరకెక్కింది. ఓ పుణ్యభూమి అందులో బార్భేరియన్ కింగ్.. బింబిసారగా (Bimbisara) కళ్యాణ్ రామ్ (Kalyan Ram ) ఇందులో కనివిందు చేశాడు. ఈ సినిమా విజయంలో కీరవాణి అందించిన సంగీతం పెద్ద ఎసెట్‌గా నిలిచింది. (Twitter/Photo)
ఒక యుద్ధం మీద పడితే ఎలా ఉంటోందో అని డైలాగులు పేలాయి. ‘ఎంత మంచి వాడవురా’ సినిమా తర్వాత కళ్యాణ్ రామ్ చేసిన సినిమా ‘బింబిసార’. ఈ సినిమాను ఎన్టీఆర్ ఆర్ట్స్ పతాకంపై నిర్మిస్తోన్న ఈ చిత్రానికి కళ్యాణ్ రామ్ బావమరిది హరికృష్ణ పేరును నిర్మాతగా పరిచయం చేశారు. కళ్యాణ్ రామ్. గతంలో విడుదల చేసిన పోస్టర్లో ‘ఏ టైమ్ ట్రావెల్ టూ ఈవిల్ టూ గుడ్’. చెడు నుంచి ఎలా జరిగిందనేదే ఈ సినిమా స్టోరీ అనేది ట్యాగ్ లైగ్. (Twitter/Photo)