TOLLYWOOD STAR HERO RAM CHARAN GIVING WHOOPING SALARY TO HIS PERSONAL CAR DRIVER AND HERE THE DETAILS PK
Ram Charan: రామ్ చరణ్ కారు డ్రైవర్ నెల జీతం ఎంతో తెలుసా.. సాఫ్ట్వేర్ ఉద్యోగి రేంజ్లో..!
Ram Charan: స్టాఫ్‌ను బాగా చూసుకోవడంలో మన హీరోలు ఎప్పుడూ ముందుంటారు. మరీ ముఖ్యంగా మెగా కుటుంబంలో అయితే తమ స్టాఫ్‌ను సొంత వాళ్లలాగే చూసుకుంటారు. తాజాగా రామ్ చరణ్(Ram Charan) కార్ డ్రైవర్ జీతం ఎంతో తెలుసా అంటూ సోషల్ మీడియాలో ప్రచారం మొదలైంది.
తెలుగు ఇండస్ట్రీలో ఉన్న టాప్ హీరోలలో రామ్ చరణ్ ముందుంటాడు. చిరంజీవి వారసుడిగా ఎంట్రీ ఇచ్చినా కూడా తనకంటూ ప్రత్యేక మార్కెట్ సంపాదించుకోడానికి విశ్వప్రయత్నాలు చేస్తున్నాడు చరణ్. ఈ క్రమంలో సక్సెస్ అయ్యాడు కూడా.
2/ 7
తెలుగులో ఇప్పుడున్న టాప్ 5 హీరోలలో ఒకడిగా నిలిచాడు మెగా వారసుడు. కేవలం 14 ఏళ్ళ కెరీర్లోనే మగధీర, రంగస్థలం లాంటి ఇండస్ట్రీ హిట్స్ సొంతం చేసుకున్నాడు చరణ్. దాంతో పాటు చిరుత, నాయక్, ఎవడు, ధృవ లాంటి విజయాలు కూడా ఈయన ఖాతాలో ఉన్నాయి.
3/ 7
ప్రస్తుతం రాజమౌళి సినిమాతో బిజీగా ఉన్నాడు చరణ్. దాంతో పాటు శంకర్ దర్శకత్వంలోనూ ఓ సినిమా చేస్తున్నాడు మెగా హీరో. ఇదంతా ఇలా ఉంటే స్టాఫ్‌ను బాగా చూసుకోవడంలో మన హీరోలు ఎప్పుడూ ముందుంటారు. మరీ ముఖ్యంగా మెగా కుటుంబంలో అయితే తమ స్టాఫ్‌ను సొంత వాళ్లలాగే చూసుకుంటారు.
4/ 7
అందుకే చిరంజీవికి ఇండస్ట్రీకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు అంటే దాదాపు 43 ఏళ్ళు ఒకే మేకప్ మెన్ ఉన్నాడు. మరోవైపు రామ్ చరణ్ కూడా తన స్టాఫ్‌ను మార్చడం పెద్దగా ఇష్టముండదు. ఒకరు సెట్ అయితే.. వాళ్ళనే బాగా చూసుకుంటారు.
5/ 7
స్టాఫ్ కూడా వాళ్లకు అంతే నమ్మకంగా ఉంటారు. తాజాగా సోషల్ మీడియాలో రామ్ చరణ్ కార్ డ్రైవర్ నెల జీతం గురించి చర్చ బాగా జరుగుతుంది. తన చుట్టూ పనిచేసే వాళ్లకు మంచి వేతనం ఇస్తున్నాడు రామ్ చరణ్. కరోనా సమయంలోనూ ఏ ఒక్కరికి కూడా ఇబ్బంది పెట్టలేదని చరణ్ స్టాఫ్ చెప్తున్నారు.
6/ 7
తన దగ్గర పని చేస్తున్నపుడు వాళ్లను బాగా చూసుకోవడం కూడా తన బాధ్యతగానే భావిస్తుంటాడు చరణ్. అంతేకాదు వాళ్లకు జీతాలు కూడా భారీగానే ఇస్తుంటాడని తెలుస్తుంది. తాజాగా ఈయన కారు డ్రైవర్‌కు నెలకు ఏకంగా 45 వేల జీతం ఇస్తున్నట్లు ప్రచారం జరుగుతుంది.
7/ 7
అంటే దాదాపు ఓ సాఫ్ట్ వేర్ ఉద్యోగి రేంజ్‌లోనే చరణ్ కార్ డ్రైవర్ కూడా జీతం అందుకుంటున్నాడు. దాంతో పాటు పండగలు, పబ్బాలు వచ్చినపుడు బోనస్‌లు కూడా బాగానే ఇస్తుంటాడని తెలుస్తుంది. ఏదేమైనా కూడా చరణ్ కారు డ్రైవర్ జీతం ఇంత ఉందా అంటూ నోరెళ్లబెడుతున్నారు నెటిజన్లు.