దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు దర్శకత్వ పర్యవేక్షణలో వచ్చిన చిత్రం పెళ్లి సందD. ఆర్కా మీడియా వర్క్స్, ఆర్.కె ఫిలిం అసోసియేట్స్ బ్యానర్స్‌పై కె.కృష్ణ మోహన్ రావు సమర్పణలో దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు అందించిన ఈ చిత్రానికి గౌరి రోణంకి దర్శకత్వం వహించారు. శ్రీకాంత్ తనయుడు రోషన్, శ్రీలీల హీరోహీరోయిన్లుగా నటించారు. (Sreeleela/Instagram)
ఈ సినిమాను పోయినేడాది 2021 దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురాగా.. మంచి విజయాన్ని అందుకుంది. గతంలో పెళ్లి సందడి సంగీతం అందించిన కీరవాణి, గీతా రచయిత చంద్రబోస్ ఈ సినిమాకి కూడా పనిచేయడం విశేషం. అంతేకాదు తండ్రి నటించిన టైటిల్‌తో తనయుడు హీరోగా నటించి హిట్ అందుకోవడం మరో విశేషం. ఈచిత్రంలో రాఘవేంద్రరావు కూడా కీలక పాత్రలో కనిపించి అదరగొట్టారు. Photo : Instagram
శ్రీలీల 2001 జూలై 14న యునైటైడ్ స్టేట్స్లో జన్మించింది. తెలుగు ఫ్యామిలీలో పుట్టిన ఈమె తల్లి ప్రముఖ గైనకాలిస్ట్. ఆ తర్వాత యూఎస్‌లో జన్మించిన ఈమె బెంగుళూరులో చదువుకుంది. ఈమె పెళ్లి సందD సినిమా కంటే ముందు ఈమె కన్నడలో ‘కిస్’, ’భారతే’ అనే సినిమాల్లో నటించింది. అక్కడ నటిస్తూనే తెలుగులో తన లక్‌ను పరీక్షించుకుంది. ( Photo : Instagram)