ఎందుకో తెలియదు కానీ ఈ మధ్య తెలుగు సినిమా ఇండస్ట్రీలో పెళ్లి బంధం పెద్దగా నిలబడటం లేదు. భేదాభిప్రాయాలతో ఒకరికొకరు దూరమైపోతున్నారు. ఈ మధ్య విడాకుల కేసులు కూడా ఎక్కువగా వినిపిస్తున్నాయి. కొన్ని జంటలు దశాబ్ధాల పాటు బలంగా ఉన్నా కూడా కొందరు మాత్రం చాలా వీక్. వాళ్లలో వాళ్లకు కుదరక.. పొత్తు పడక.. అభిప్రాయాలు కలవక పెళ్లైన తర్వాత విడిపోవడానికి చాలా ఉత్సాహం చూపిస్తుంటారు.
ఈ జంట ప్రస్తుతానికి విడివిడిగానే ఉంటున్నారు కూడా. ఈ ఇద్దర్నీ కలపడానికి ఇరు కుటుంబాలు ప్రయత్నించినా కూడా కుదిరేలా కనిపించడం లేదని తెలుస్తుంది. ఎంత మాట్లాడినా కూడా విడిపోవడమే పరమావధిగా పెట్టుకోవడంతో ఇరు కుటుంబాలు దీనిపై చర్చింకుకుని నిర్ణయం తీసుకుంటున్నారని తెలుస్తుంది. అమ్మాయితో పాటు అబ్బాయి తరఫు వాళ్లు తమకు ఇబ్బందులున్నాయని.. ఇక కలిసుండే ప్రసక్తే లేదని చెబుతున్నారు.
కళ్ల ముందు చిలకా గోరింకల్లా ఇన్నాళ్లూ కలిసున్న జంటే ఇప్పుడు విడిపోతుందని తెలిసి షాక్ అవుతున్నారు అభిమానులు. వామ్మో.. మొన్నటి వరకు నువ్వు లేక నేను లేను అని పాడుకున్న వాళ్లే ఇప్పుడు విడాకులకు సిద్ధం అవుతున్నారా అంటూ ముక్కున వేలేసుకుంటున్నారు. మొత్తానికి మరి చూడాలిక.. ఈ స్టార్ కపుల్ విడాకుల వ్యవహారం ఎంతవరకు రానుందో..?