అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ తెరకెక్కించిన పుష్ప సినిమా ప్రపంచ వ్యాప్తంగా డిసెంబర్ 17న విడుదలైంది. ఈ చిత్రానికి యావరేజ్ టాక్ వచ్చింది. ముందు నుంచి అనుకుంటున్నట్లుగానే అల్లు అర్జున్ ఇరగ్గొట్టాడు. పుష్ప పాత్ర కోసమే ఈయన పుట్టాడా అనే స్థాయిలో నటించాడు. అందులో బన్నీ నటన చూసి అంతా ఫిదా అయిపోతున్నారు.
ట్విట్టర్ రివ్యూ,పుష్ప మూవీ రివ్యూ" width="1600" height="1600" class="size-full wp-image-1125928" /> ముఖ్యంగా ఇప్పటి వరకు కెరీర్లో ఎన్నడూ లేనంతగా పుష్ప కోసం మేకోవర్ అవ్వడమే కాకుండా.. ప్రతీ చిన్న డీటైల్ కూడా మిస్ కాకుండా అద్భుతంగా ఈ పాత్రలో ఒదిగిపోయాడు. అందుకే పుష్ప సినిమా టాక్తో సంబంధం లేకుండా.. ఒక్కసారైనా బన్నీ కోసం చూడొచ్చురా అంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ పెడుతున్నారు కామన్ ఆడియన్స్.
ఇక అభిమానులు అయితే పండగ చేసుకుంటున్నారు. అల్లు అర్జున్ పర్ఫార్మెన్స్కు వాళ్లు ఫిదా అయిపోతున్నారు. అబ్బా ఏం చేసాడ్రా బాబూ అంటూ పొంగిపోతున్నారు. అయితే అన్నీ బాగానే ఉన్నా ఒక్క విషయంలో మాత్రం పుష్ప చాలా ఇబ్బంది పడుతున్నాడు.. ప్రేక్షకులను కూడా పెడుతున్నాడు. అదే సినిమా నిడివి విషయంలో. ఆల్రెడీ రెండు భాగాలుగా చేయాలని ఫిక్స్ అయినపుడు.. మొదటి భాగం క్రిస్పీగా ఉండుంటే బాగుండు అని చాలా మంది అభిప్రాయం.
మూడు గంటలు నిడివి ఈ సినిమాకు శాపంగా మారుతుంది. అవసరం లేని చాలా సన్నివేశాలు సినిమాను బాగా డిస్టర్బ్ చేసాయి. ముఖ్యంగా బన్నీ, రష్మిక ట్రాక్ అంతా ఆకట్టుకోకపోగా.. విసుగు పుట్టించాయనేది విశ్లేషకుల అభిప్రాయం. లవ్ ట్రాక్ బాగా ఇరికించినట్లు అనిపిస్తుంది. ఆడియన్స్ కూడా ఈ సన్నివేశాలను చూసి ఏంటిది సుక్కు ఇలా తీసాడు అంటున్నారు.