Spy Roles In Tollywood | ప్రస్తుతం తెలుగు హీరోలు సహా సౌత్ ఇండస్ట్రీ హీరోలు స్పై ఏజెంట్ పాత్రల్లో కనిపించడానికి ఆసక్తి చూపిస్తున్నారు. ఈ యేడాది విజయ్ ‘బీస్ట్’ మూవీలో RAW ఏజెంట్ పాత్రలో మెప్పించారు. తాజాగా కార్తి ‘సర్ధార్’ సినిమాలో అసలు సిసలు గూఢచారి జీవితం ఎలా ఉంటుందో చక్కగా నటించి చూపించాడు. వీళ్ల తర్వాత అఖిల్ కూడా ఏకంగా ‘ఏజెంట్’ అంటూ భారత గూఢచారి పాత్రలో కనివిందు చేయనున్నారు. అదే రూట్లో హీరో నిఖిల్ సిద్ధార్ధ్ కూడా ‘స్పై’ అంటూ టైటిల్ రోల్ ప్లే చేస్తూ ఓ సినిమా చేస్తున్నారు. (Twitter/Photo)
సర్ధార్ | సర్ధార్ మూవీలో హీరో కార్తి భారత గూఢచారి (RAW - Reaserch and Analysis Wing) పాత్రలో ఒదిగిపోయారు. ఈ సినిమాలో భారత గూఢచారుల జీవితాలు ఎలా ఉంటాయి. సామాన్య జనాల్లో వాళ్లు ఎలా మసులు కుంటారు. ఒకటికి నాలుగైదు ఐడెంటీలు.. వివిధ భాషల్లో ప్రావీణ్యం.. సమయానుకూలంగా గూఢచారులు ఎలా వేషాలు మార్చుకుంటారో ఈ సినిమా చక్కగా చూపించారు. (Twitter/Photo)
విజయ్ - బీస్ట్ | తమిళ స్టార్ హీరో విజయ్ (Vijay) గత కొన్నేళ్లుగా తెలుగు మార్కెట్ పై పట్టు సాధిస్తున్నారు. ఇక్కడ వరుస విజయాలతో దూకుడు మీదున్నారు. ఇపుడు బీస్ట్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమాలో విజయ్ ‘RAW’ ఏజెంట్ పాత్రలో నటించారు. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఫ్లాప్ టాక్‌తో రూ. 7 కోట్ల నష్టంతో బాక్సాఫీస్ దగ్గర యావరేజ్‌గా నిలిచి హీరోగా విజయ్ సత్తా ఏంటో చూపించింది. (Beast Telugu Photo : Twitter)
Akhil Akkineni As Agent | అక్కినేని అఖిల్ ఇపుడు సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ‘ఏజెంట్’ సినిమాతో పలకరించబోతున్నాడు. ఈ సినిమాలో అఖిల్ జేమ్స్ బాండ్ తరహా స్పై క్యారెక్టర్లో కనిపించున్నాడు. ‘ఏజెంట్’ సినిమాలో గూఢచారి పాత్ర కోసం అఖిల్ అక్కినేని పూర్తిగా ట్రాన్స్ఫామ్ అయ్యాడు. గడ్డం చిరిగిన జుట్లుతో సిక్స్ బ్యాక్ బ్యాడీతో అఖిల్ ఆహార్యం ఆకట్టుకునేలా ఉంది. (Twitter/Photo)
నిఖిల్ - స్పై | నిఖిల్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘స్పై’. గ్యారీ బీహెచ్ ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయమవుతున్నారు. తాజాగా విడుదల చేసిన ఫస్ట్ గ్లింప్స్‌తో ‘స్పై’గా నిఖిల్ అదరగొట్టేసాడు. మంచు కొండల్లో ఐస్‌తో కప్పబడిన గన్ బాక్స్.. అందులో గన్ను బుల్లెట్స్‌తో లోడ్ చేసి బైక్ పై ఎవరినో ఛేజ్ చేస్తూ విడుదల చేసిన ఫస్ట్ గ్లింప్స్ అదిరిపోయింది. హీరోగా ‘స్పై’ మూవీ నిఖిల్‌కు ‘కార్తికేయ 2’ తర్వాత చేయబోతున్న ప్యాన్ ఇండియా మూవీ. మరి ఈ సినిమాతో నిఖిల్ స్పైగా ఎలాంటి మాయ చేస్తాడో చూడాలి. నిఖిల్ కంటే ముందు స్పై ఏజెంట్ తరహా పాత్రల్లో మెప్పించిన హీరోల విషయానికొస్తే.. (Twitter/Photo)
కమల్ హాసన్ - విక్రమ్ | లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో కమల్ హాసన్ హీరోగా నటించిన ‘విక్రమ్’ మూవీ కూడా అపుడెపుడో కమల్ హాసన్ నటించిన ‘ఏజెంట్ విక్రమ్ 007’ మూవీకి సీక్వెల్‌గా ‘విక్రమ్’ సినిమాను తెరకెక్కించారు. ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర మంచి విజయం సాధించింది.ఈ చిత్రంలో కమల్ హాసన్.. మాజీ భారత సీక్రెట్ ఏజెంట్ పాత్రలో నటించారు. 60 యేళ్ల పై పడిన వయసులో కూడా తన యాక్షన్ సీక్వెన్స్‌తో అదరగొట్టేసారు. (Twitter/Photo)
అంతకు ముందు ‘విశ్వరూపం’ సినిమాలో కమల్...భారత్ జేమ్స్‌బాండ్ గా ఏ రకంగా నట విశ్వరూపం చూపించాడో సెపరేట్‌గా చెప్పాల్సిన పనిలేదు. 60 యేళ్ల పై పడ్డ వయసులో కమల్ ఈ మూవీ కోసం చేసిన యాక్షన్ సీక్వెన్స్ ప్రేక్షకులకు ఇప్పటికీ గుర్తున్నాయి. ఈ సినిమాకు సీక్వెల్‌గా విడుదలైన ‘విశ్వరూపం2’ మాత్రం ప్రేక్షకులను అంచనాలను అందుకోలేకపోయింది. (Twitter/Photo)
డెవిల్ - నందమూరి కళ్యాణ్ రామ్ | అటు నందమూరి కళ్యాణ్ రామ్.. స్వాతంత్రపు పూర్వపు స్టోరీతో చరిత్రలో మరుగున పడిన బ్రిటిష్ సీక్రెట్ జీవిత కథ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతోంది. నవీన్ మేడారం ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. కళ్యాణ్ రామ్ తొలిసారి జేమ్స్‌బాండ్ తరహా సీక్రెట్ పాత్రలో తొలిసారి నటిస్తుండంతో ఈ సినిమాపై అపుడే అంచనాలు మొదలయ్యాయి.(Twitter/Photo)
ప్రభాస్ - ప్రాజెక్ట్ K | ప్రభాస్ నాగ్ అశ్విన్ సినిమాలో జేమ్స్ బాండ్ తరహా పాత్రలో నటించనున్నాడా ? అంటే ఔననే అంటున్నాయి టాలీవుడ్ వర్గాలు. ప్రాజెక్ట్ K పేరుతో తెరకెక్కుతోన్న ఈ చిత్రాన్ని టైమ్ ట్రావెల్ నేపథ్యంలో సీక్రెట్ ఏజెంట్ నేపథ్యాన్ని జోడించి తెరకెక్కించబోతున్నట్టు సమాచారం. (Instagram/Prabhas)
గూఢచారి 2 - అడివి శేష్ | అడివి శేష్ హీరోగా నటించిన ‘గూఢచారి’ మూవీ కూడా జేమ్స్ బాండ్ తరహా సినిమానే.ఈ మూవీలో అడివి శేష్..సీక్రెట్ ఏజెంట్ పాత్రలో మెప్పించడం విశేషం. ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర మంచి ఫలితాన్నే రాబట్టింది. ఇపుడు ఈ సినిమాకు సీక్వెల్‌గా ‘గూఢచారి 2’ను తెరకెక్కిస్తున్నట్టు చెప్పారు. (Twitter/Photo)
మహేష్ బాబు - స్పైడర్ | మరోవైపు మహేశ్ కూడా...మురుగదాస్ దర్శకత్వంలో చేసిన ‘స్పైడర్’ మూవీలో సీక్రెట్ ఏజెంట్ తరహా పాత్రలో నటించారు. ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్‌గా నిలిచింది. ఇపుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కబోయే సినిమాలో మహేష్ బాబు ఇదే తరహా పాత్రలో కనిపించనున్నట్టు సమాచారం. (Facebook/Photo)
గూఢచారి 116 |తెలుగులో జేమ్స్‌బాండ్ తరహా సీక్రెట్ ఏజెంట్ పాత్ర అంటే ముందుగా సూపర్ స్టార్ కృష్ణనే గుర్తుకు వస్తాడు. ‘గూఢచారి 116’ నుంచి మొదలు పెడితే ఈయన ఎన్నో సినిమాల్లో సీక్రెట్ ఏజెంట్ పాత్రలను పోషించడం విశేషం. ఒక రకంగా తెలుగు వాళ్లకు జేమ్స్ బాండ్ అంటే కృష్ణ గారే గుర్తుకు వస్తారు. (Twitter/Photo)