Singer Sunitha Marriage: సింగర్ సునీత పెళ్లి ఫోటోలు.. భార్యతో కలిసి వచ్చిన నితిన్..

Singer Sunitha marriage: మ్యాంగో వీడియోస్ అధినేత రామ్ వీరపనేని, ప్రముఖ గాయని సునీతల పెళ్లి వేడుక అంగరంగ వైభవంగా జరిగింది. ఈ వివాహానికి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. ఈయనతో పాటు ఈ వివాహ వేడుకల్లో హీరో నితిన్ కూడా పాల్గొన్నాడు. ఆయన తన భార్య శాలినితో కలిసి వచ్చాడు.