Tollywood Sequels | హాలీవుడ్, బాలీవుడ్లో హిట్టైన సినిమాలకు కొనసాగింపుగా సీక్వెల్స్ తెరకెక్కించడం అక్కడ ఎప్పటి నుంచో ఉంది. గత కొన్నేళ్లుగా తెలుగులో కూడా హిట్టైన సినిమాలకు కొనసాగింపుగా సీక్వెల్స్‌ను తెరకెక్కుతున్నాయి. ఈ కోవలో భాగంగా కార్తికేయ 2, హిట్ 2 మూవీలు త్వరలో ప్రేక్షకులను పలకరించనున్నాయి. తాజాగా ఈ రూట్లో ఈ యేడాది బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న డీజే టిల్లుకు సీక్వెల్ తెరకెక్కించబోతున్నట్టు ఈ సినిమా దర్శక,నిర్మాతలు ప్రకటించారు. (File/Photo)
జాంబి రెడ్డి 2: ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తేజ సజ్జ హీరోగా నటించిన ఈ చిత్రం ఫిబ్రవరి 5న విడుదలైంది. థియేటర్స్ 50 శాతం ఆక్యుపెన్సీతో నడుస్తున్నపుడు వచ్చిన ఈ చిత్రం రూ. 5 కోట్లకు పైగా షేర్ వసూలు చేసి సేఫ్ జోన్లోకి వచ్చింది. ఈ చిత్రానికి సీక్వెల్ ఇప్పుడు తెరకెక్కించబోతున్నాడు దర్శకుడు ప్రశాంత్. త్వరలోనే పూర్తి వివరాలు బయటికి రానున్నాయి.