తెలుగు ఇండస్ట్రీలో శోభన్ బాబు తర్వాత ఆ స్థాయి ఫ్యామిలీ ఫాలోయింగ్ సంపాదించుకున్న హీరో వెంకటేష్ మాత్రమే. కుటుంబ ప్రేక్షకుల్లో వెంకీకి ఉన్న ఇమేజ్ మామూలుగా ఉండదు. ఆయన ఏడిస్తే ఆడాళ్లు కూడా ఏడవాల్సిందే.. మరో ఆప్షన్ లేదు. ఇప్పటికే 80 సినిమాలకు పైగా నటించిన ఈయన.. సూపర్ సక్సెస్ రేట్‌తో దూసుకుపోతున్నాడు. ఇప్పటికీ ఈయనకు మంచి విజయాలు వస్తున్నాయి. మొన్నటికి మొన్న వచ్చిన నారప్ప.. దృశ్యం 2 సినిమాలకు సైతం ప్రైమ్ వీడియోలో అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఈ రెండు చిత్రాలను 70 కోట్ల వరకు సురేష్ బాబు అమ్మినట్లు వార్తలు వస్తున్నాయి.