Direction To Action | ఆన్ ది స్క్రీన్ హీరో శాసిస్తే...బిహైండ్ ద స్క్రీన్ డైరెక్టర్ డిక్టేట్ చేస్తాడు. ఇది సినిమా పుట్టినప్పటి నుంచి వున్న ఫార్ములా. ఇపుడు ఆ ఫార్ములాను కొంత మంది డైరెక్టర్లు బ్రేక్ చేస్తున్నారు. ఎప్పుడు తెర వెనక కూర్చోని హీరోలకు, హీరోయిన్స్‌కు స్టార్ట్, కెమెరా, యాక్షన్ అంటూ డైరెక్ట్ చేసే దర్శకులు ఇపుడు ఆన్ ది స్క్రీన్ అదరగొడుతున్నారు. ఇప్పటికే దర్శకేంద్రుడు కే.రాఘవేంద్రరావు పెళ్లి సందడి సినిమాతో నటుడిగా సరికొత్త ప్రస్థానానికి నాంది పలికారు. (Twitter/Photo)
నటుడు, రచయిత, దర్శకుడు తనికెళ్ల భరణి ఈ సినిమాకు దర్శకత్వం వహించనున్నారు. అయితే, ఇదేదో సందేశాత్మక సినిమా కాదు. పూర్తి కమర్షియల్ ఎలిమెంట్స్ తో ఈ సినిమా తెరకెక్కనున్నట్టు సమాచారం. ఈ చిత్రంలో నలుగురు హీరోయిన్స్ ఉన్నారు. అందులో ఒకరు రమ్యకృష్ణ, సమంత, అనుష్క, తమన్నా నటిస్తున్నట్టు సమాచారం. (Twitter/Photo)
దర్శక నటుల్లో ముందుగాల చెప్పుకోవాల్సింది దర్శకరత్న దాసరినారాయణరావుని. ఆర్టిస్టుల నుంచి నటన రాబట్టుకునమే కాదు. సొంతంగా యాక్ట్ చేసి ఔరా అనిపించుకున్నారు దాసరి నారాయణ రావు. ఒక దర్శకుడిగా ఉంటూ ఎక్కువ సినిమాల్లో అది కూడా వేరే దర్శకుల సినిమాల్లో తన నటనతో ఆకట్టుకున్న దర్శక నటుడిగా దాసరి నారాయణ రావు రికార్డు క్రియేట్ చేసారనే చెప్పాలి. (File/Photo)
ఎస్వీ కృష్ణారెడ్డి కూడా డైరెక్టర్‌గా ప్రూవ్ చేసుకున్న తర్వాత ‘ఉగాది’,‘అభిషేకం’ వంటి సినిమాలత హీరోగా ముఖానికి మేకప్ వేసుకున్నాడు. అంతకుముందు 80ల చిరంజీవి హీరోగా చ్చిన ‘కిరాతకుడు’చిత్రంలో కృష్ణారెడ్డి చిన్న రోల్ కనిపించిండం విశేషం. ఇక ఎన్టీఆర్ కథానాయకుడు సినిమాలో కమలకర కామేశ్వరరావు పాత్రలో మెప్పించడం విశేషం. (Twitter/Photo)
కన్నడ విషయానికొస్తే.. యాక్టర్ ఉపేంద్ర కూడా డైరెక్టర్ గా పేరు సంపాదించిన తర్వాతే హీరో అయ్యాడు. అప్పట్లో రాజశేఖర్ హీరోగా వచ్చిన ‘ఓంకారం’ సినిమాను ఉపేంద్రనే డైరెక్ట్ చేసిన సంగతి తెలిసిందే కదా. ప్రెజెంట్ హీరోగానే నటిస్తున్నారు. ఈ యాక్టర్ కమ్ డైరెక్టర్ లిస్టులో కన్నడ నటుడు సుదీప్ కూడా వున్నారు. అప్పట్లో కన్నడల కొన్ని రీమేక్ సినిమాలను డైరెక్ట్ చేసిన తర్వాతే ఆయన హీరో అయ్యారు. (File/Photo)