తెలుగు ఇండస్ట్రీలో ఎవర్ గ్రీన్ కారెక్టర్ ఆర్టిస్టులలో అందరికంటే ముందుంటారు సుధ. 30 ఏళ్ళ కింద కెరీర్ మొదలుపెట్టిన ఈమె.. ఇప్పటి వరకు 800 సినిమాలకు పైగానే నటించారు. తెలుగు మాత్రమే కాదు.. సౌత్ భాషలన్నింటిలోనూ ఈమెకు మంచి గుర్తింపు ఉంది. స్టార్ హీరోలందరి సినిమాల్లోనూ నటించింది సుధ. తనకంటూ ఒక ప్రత్యేకతను సంపాదించుకోవడమే కాకుండా.. సీనియర్ నటిగా క్రేజ్ కూడా తెచ్చుకుంది సుధ.
ఇప్పటికీ ఆమె కారెక్టర్ ఆర్టిస్టుగా ఫుల్ బిజీ. ఈ మధ్యే ఈమె ప్రధాన పాత్రలో 'మాతృదేవోభవ' అనే సినిమా వచ్చింది. ఈ సినిమాకు సంబంధించిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ సినిమా విశేషాలతో పాటు తన వ్యక్తిగత విషయాలు కూడా చెప్పుకొచ్చింది. ఇన్నేళ్ల కెరీర్లో బాగానే సంపాదించాను.. అలాగే పోగొట్టుకున్నానని చెప్పింది సుధ.
సంపాదించిన దాంతో స్వీట్ షాప్ పెడితే తన అనుకున్న వాళ్లే మోసం చేసారని.. ఢిల్లీలో తన సోదరుడితో కలిసి హోటల్ పెడితే బాగానే నడిచిందని చెప్పుకొచ్చింది. అందుకే ఇప్పుడు మరో హోటల్ పెట్టామని తెలిపింది సుధ. కానీ హోటల్ నష్టం రావడంతో తీసేసామని చెప్పింది సుధ. కొన్ని కుటుంబ సమస్యల వల్ల తాను చెన్నైకి రావలసి వచ్చిందని.. తమ అబ్బాయి, భర్త అమెరికాలో ఉంటున్నారని చెప్పింది సుధ.
తన కొడుకు దారి తను చూసుకున్నాడని.. ఆయనతో పెద్దగా కనెక్షన్ లేదని చెప్పుకొచ్చింది సీనియర్ నటి సుధ. కొడుకుతో గొడవైందని.. అతడితో మాట్లాడి కూడా ఆరేళ్లు దాటిపోయిందని చెప్పింది సుధ. ఉన్నా లేకపోయినా ఒకటే అన్నట్లుగా తాను ఉన్నానని చెప్పింది ఈమె. మరోవైపు తమ అమ్మాయి ఇక్కడే జాబ్ చేస్తుందని.. ఆమెకు తోడు తాను ఇక్కడే ఉన్నానని చెప్పుకొచ్చింది సుధ.
తన అమ్మగారు పోయి 15 ఏళ్లు అయిందని.. కొడుకులు ఉన్నప్పటికీ నాన్నకి వాళ్ల సపోర్టు దొరకలేదని చెప్పుకొచ్చింది సీనియర్ నటి. నాన్న కేన్సర్ బారిన పడటంతో ట్రీట్మెంట్కి అంతా పోయిందని తెలిపింది సుధ. నాన్న కంటే అమ్మగారు ముందు పోయారని.. అప్పుడు కూడా నేను అంతగా బాధపడలేదని.. తమ నాన్న పోయిన తర్వాత లైఫ్ ఏంటో తెలిసిందని చెప్పుకొచ్చింది సుధ. అందరూ దూరం పెట్టినప్పుడు అమ్మకి ధైర్యం చెప్పి.. ఆమె తల ఎత్తుకునేలా చేశానంటుంది సుధ.
తమ అబ్బాయి, భర్త యుఎస్‌లో ఉన్నారని.. వాళ్లు తన గురించి ఆలోచించడం లేదని తెలిపింది సుధ. తాను ఎప్పుడూ పిల్లల గురించి ఏడవలేదని.. భర్త గురించి ఆలోచించలేదని.. ఎందుకంటే రేపటి రోజున వాళ్లకి అదే పరిస్థితి వస్తుందని చెప్పింది సుధ. ఇప్పుడు తన అమ్మాయికి పెళ్లి అయిందని.. తన మనవరాలితో హ్యాపీగా ఉన్నానని గుర్తు చేసుకుంది సుధ. మౌనాన్ని మించిన ఆయుధం మరోటి లేదని చెప్పుకొచ్చింది సుధ.