TOLLYWOOD SENIOR ACTRESS SNEHA EARNING MORE FROM ADS THAN MOVIES WITH HIS HUSBAND PRASANNA AK
Sneha: వామ్మో.. భర్తతో కలిసి స్నేహ అన్ని కోట్లు సంపాదిస్తోందా ? బ్రాండ్ అయిపోయారా ?
ప్రస్తుతం చాలామంది సినీ సెలబ్రిటీలు యాడ్స్‌పై కూడా ఎక్కువగా ఫోకస్ చేస్తున్నారు. వీరిలో సీనియర్ హీరోయిన్ స్నేహ, ఆమె భర్త ప్రసన్న కూడా ఉన్నారు. సినిమాలకు దూరంగా ఉంటున్న స్నేహ.. ఇప్పుడు వాటి కంటే ఎక్కువగా యాడ్స్‌పైనే దృష్టి పెడుతోంది. (Images Courtesy: Twitter - InStagram)
అందాల భామ స్నేహ తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ సినిమాల్లో నటించింది. ఒకప్పుడు స్టార్ హీరోల సరసన నటించిన ఈ వెటరన్ హీరోయిన్.. ఇప్పుడు యాడ్స్, ఫోటోషూట్స్ మీదే ఎక్కువగా ఫోకస్ చేస్తోంది. సినిమాల కంటే ఎక్కువగా వీటికే ప్రయారిటీ ఇస్తోంది.
2/ 7
కన్నడంలోనూ స్నేహ అనేక సినిమాల్లో నటించింది. కురుక్షేత్ర మూవీలో ఈ అందాల భామ ద్రౌపదిగా నటించి మెప్పించింది.
3/ 7
సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టినప్పటికీ.. మిగతా హీరోయిన్ల తరహాలో గ్లామర్ రోల్స్‌కు స్నేహ ఓకే చెప్పలేదు. తనకంటూ ప్రత్యేకతను కొనసాగిస్తూ.. కేవలం కొన్ని పాత్రలకు మాత్రమే పరిమితమైంది. పెళ్లి చేసుకుని, పిల్లలు పుట్టిన తరువాత కేవలం సపోర్టింగ్ రోల్స్‌లో కనిపిస్తోంది.
4/ 7
తొలివలపు సినిమా ద్వారా టాలీవుడ్లో అడుగుపెట్టిన స్నేహ.. ఆ తరువాత ప్రియమైన నీకులో నటించింది. అది సక్సెస్ అయ్యింది. ఆ తరువాత ఆమెకు అవకాశాలు వరుసగా వచ్చాయి. హనుమాన్ జంక్షన్, శ్రీరామదాసు, సంక్రాంతి, రాధా గోపాలం, వెంకీ సినిమాల్లో నటించి మెప్పించింది స్నేహ.
5/ 7
ఒకప్పుడు సినిమాలు, కుటంబంతోనే ఎక్కువగా కాలం గడిపిన స్నేహ, ప్రసన్న జంట.. ఇప్పుడు వాటి కంటే ఎక్కువగా యాడ్స్ మీద దృష్టి పెడుతున్నట్టు వార్తలు బలంగా వినిపిస్తున్నాయి.
6/ 7
ప్రస్తుతం స్నేహ, ప్రసన్న జంట కంఫర్ట్ ఫ్యాబ్రిక్, ఆశీర్వాద్, సన్‌ఫీస్ట్ మ్యారీ లైట్, విమ్ బార్, జీఆర్టీ జువెల్లరీ యాడ్స్‌లో కనిపిస్తోంది. వీటితో పాటు స్నేహ అనేక యాడ్స్‌లో తళుక్కుమంటోంది.
7/ 7
యాడ్స్ ద్వారా ఈ జంట రూ. 3.50 కోట్లకు పైగానే ఆర్జించినట్టు తెలుస్తోంది. అంతేకాదు యాడ్స్‌లో మంచి పాపులర్ అయిన ఈ జంట.. మరికొన్ని బ్రాండ్స్‌కు సైన్ చేసే అవకాశం ఉందనే వార్తలు వినిపిస్తున్నాయి.