తెలుగు ఇండస్ట్రీలో ఇప్పటికే చాలా మంది వారసులు ఉన్నారు. ఇప్పుడు వారసురాళ్లు కూడా వస్తున్నారు. ఇప్పటికే కొందరు వచ్చినా కూడా సక్సెస్ కాలేదు. కానీ ఇప్పుడు కొత్తగా మరికొందరు రాబోతున్నారు. ఈ జాబితాలోకే హీరో శ్రీకాంత్ కూతురు మేధ కూడా రాబోతుందని తెలుస్తుంది. ఈమె హీరోయిన్గా ఎంట్రీ ఇవ్వబోతుందనే వార్తలు వస్తున్నాయి. 30 ఏళ్లుగా తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ సంపాదించుకుని 100కు పైగా సినిమాలు చేసాడు శ్రీకాంత్.
ఇప్పుడు విలన్‌గా కూడా రాణిస్తున్నాడు. ఈ మధ్యే తన 25వ వివాహ వార్షికోత్సవం పూర్తి చేసుకున్నాడు శ్రీకాంత్. దీనికి సంబంధించిన ఫోటోలు కొన్ని వైరల్ అవుతున్నాయి. అందులో శ్రీకాంత్ కొడుకు రోషన్‌తో పాటు భార్య ఊహ, కూతురు మేధ ఫోటోలున్నాయి. రోషన్ ఇప్పటికే పెళ్లి సందడి సినిమాతో అందరికీ పరిచయం అయ్యాడు. అయితే అందరికీ షాక్ ఇచ్చే విషయం మాత్రం కూతురు మేధ.
ఈమెను చూసిన వాళ్లెవరైనా షాక్ అవ్వక తప్పదు. ఎందుకంటే హీరోయిన్లు కూడా ఈమె ముందు దిగదుడుపే. ఇంకా చెప్పాలంటే ఊహకందని అందంతో అందరినీ మాయ చేస్తుంది మేధ. కచ్చితంగా నేడో రేపో శ్రీకాంత్ తనయ హీరోయిన్గా పరిచయం అవ్వడం మాత్రం ఖాయం. అందుకే చాలా మేకోవర్ అయిపోయింది మేధ. ఇప్పటి వరకు తెలుగులో స్టార్ హీరోయిన్ అయిన వారసురాలు ఒక్కరు కూడా లేరు.
తమిళంలో శృతి హాసన్ లాంటి వాళ్లు స్టార్స్ అయ్యారు కానీ తెలుగులో మాత్రం ఆ సీన్ రిపీట్ కాలేదు. సూపర్ స్టార్ కృష్ణ వారసురాలు మంజులను అభిమానులే వద్దన్నారు. దాంతో పాటు మోహన్ బాబు కుమార్తె మంచు లక్ష్మీ సైతం స్టార్ కాలేకపోయింది కానీ కారెక్టర్ ఆర్టిస్టు అయింది. తాజాగా సీనియర్ హీరో శ్రీకాంత్- ఊహ కూతురు వెండితెరకు ఎంట్రీ ఇవ్వనున్నట్లు ప్రచారం జరుగుతుంది.
ఇప్పటికే శ్రీకాంత్ తనయుడు రోషన్ నాలుగేళ్ళ కింద నాగార్జున నిర్మించిన నిర్మల కాన్వెంట్ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. ఇప్పుడు పెళ్లి సందD సినిమా చేస్తున్నాడు. రాఘవేంద్రరావు దర్శకత్వ పర్యవేక్షణలో ఈ సినిమా వస్తుంది. తాజాగా కూతురిని కూడా సినీ పరిశ్రమకు పరిచయం చేయాలని శ్రీకాంత్ భావిస్తున్నట్లు తెలుస్తుంది. ఆయన నట వారసురాలు మేధ వయసు 19 ఏళ్ళు. చూడ్డానికి అచ్చం వాళ్ళ అమ్మ ఊహలాగే ఉంటుంది మేధ కూడా.
ఇదివరకే ఈమె రుద్రమదేవి సినిమాలో కాసేపు కనిపించింది. అనుష్క శెట్టి చిన్నప్పటి పాత్రలో నటించింది మేధ. అందులో కనిపించింది కాసేపే అయినా కూడా మంచి గుర్తింపు సంపాదించుకుంది. నటిగా భవిష్యత్తు ఉందంటూ పలువురు సినీ ప్రముఖులు కూడా మేధను ప్రశంసించారు. ఈమె మంచి డాన్సర్. భరతనాట్యంలో శిక్షణ తీసుకుంది. ప్రస్తుతం ప్లస్ 2 చదువుతుంది మేధ. చదువులో కూడా ఈమె టాప్. అంతేకాదు క్రీడల్లోనూ బాగానే రాణిస్తుంది మేధ.
జాతీయ స్థాయి బాస్కెట్ బాల్ క్రీడాకారిణిగా ఉందిప్పుడు. చదువు పూర్తయిన తర్వాత వెండితెరపై అడుగు పెట్టడానికి రెడీ అవుతుందనే ప్రచారం జరుగుతుంది. తనయ కోసం సరైన కథ కోసం శ్రీకాంత్ స్వయంగా రంగంలోకి దిగాడనే వార్తలు వస్తున్నాయి. ఊహ రూపంతో ఉండే మేధ తెలుగు ప్రేక్షకులని తప్పక అలరిస్తుందని అభిమానులు భావిస్తున్నారు. త్వరలోనే మేధ ఎంట్రీకి సంబంధించిన మరిన్ని వివరాలు బయటికి రానున్నాయి. కాగా శ్రీకాంత్‌కు ఇద్దరు కుమారులు.. ఓ కూతురు ఉన్నారు.