కానీ ఇప్పుడు అలా కాదని.. ఎవరు మెంబరో ఎవరు కాదో కూడా తెలియడం లేదని చెప్పుకొచ్చాడు మురళీ మోహన్. గాడి తప్పిన 'మా'ను మళ్లీ పట్టాలెక్కించడానికి తాను చిరంజీవి, మోహన్ బాబు, జయసుధ, కృష్ణంరాజు లాంటి వాళ్ళతో కలిసి మాట్లాడుకుంటున్నట్లు తెలిపాడు మురళీ మోహన్. అందర్నీ ఒకే తాటి మీదకు తీసుకొచ్చి ఏకగ్రీవం అయ్యేలా చూస్తామంటున్నాడు ఈయన. ఈ మాటలు విన్న తర్వాత అధ్యక్ష బరిలో ఉన్న వాళ్లందరికీ షాక్ తప్పదేమో..?