Kaikala Satyanarayana: సీనియర్ నటుడు కైకాల సత్యనారాయణకు అస్వస్థత.. ఆస్పత్రిలో చికిత్స
Kaikala Satyanarayana: సీనియర్ నటుడు కైకాల సత్యనారాయణకు అస్వస్థత.. ఆస్పత్రిలో చికిత్స
Kaikala Sathyanarayana: టాలీవుడ్ సీనియర్ నటుడు కైకాల సత్యనారాయణ అస్వస్థతకు గురయ్యారు. సికింద్రాబాద్లోని ఓ ప్రముఖ ప్రైవేట్ ఆస్పత్రిలో ఆయన చికిత్స పొందుతున్నారు. ఇంతకి కైకాలకు ఏమైంది?
సీనియర్ నటుడు కైకాల సత్యానారయణ శనివారం రాత్రి ఆస్పత్రిలో చేరారు. సికింద్రాబాద్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో ఆయన చికిత్స పొందుతున్నారు.
2/ 4
సత్యనారాయణ నాలుగు రోజుల క్రితం ప్రమాదవశాత్తు ఇంట్లో జారిపడ్డారు. చాలా చిన్న గాయమే అనుకున్నారు. కానీ నిన్న రాత్రి నొప్పులు ఎక్కువగా ఉండటంతో ఆస్పత్రిలో చేర్పించారు.
3/ 4
ప్రస్తుతం సత్యనారాయణ ఆరోగ్య పరిస్థితి బాగానే ఉందని కుటుంభ సభ్యులు తెలిపారు. అభిమానులెవరూ ఆందోళన పడాల్సి అవసరం లేదని వెల్లడించారు. త్వరలోనే ఆయన డిశ్చార్జి అవుతారని వెల్లడించారు.
4/ 4
2019లో విడులైన ఎన్టీఆర్ కథనాయకుడు, మహర్షి చిత్రాల తర్వాత సినిమాలకు దూరంగా ఉన్నారు కైకాల సత్యనారాయణ. వయసు మీద పడడంతో పాటు అనారోగ్య సమస్యలతో విశ్రాంతి తీసుకుంటున్నారు.