TOLLYWOOD PRODUCER DIL RAJU BECAME FATHER AND WELCOMES BABY BOY SLB
Dil Raju: మరోసారి తండ్రి అయిన దిల్ రాజు.. బండ్ల గణేష్ ట్వీట్ వైరల్
Dil Raju: దిల్ రాజుకు ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్ పెట్టారు బండ్ల గణేష్. దిల్ రాజు అన్నా కాంగ్రాచులేషన్స్ అని తెలుపుతూ ట్వీట్ పెట్టారు. ఈ మేరకు దిల్ రాజుకు కొడుకు పుట్టాడని తెలుపుతూ అసలు విషయాన్ని బయటపెట్టాడు.
|
1/ 8
టాలీవుడ్ బడా నిర్మాతల్లో ఒకరైన దిల్ రాజు (Dil Raju) మరోసారి తండ్రి అయ్యారని తెలుస్తోంది. దిల్ రాజు త్వరలో శుభవార్త చెబుతున్నారని టాలీవుడ్లో చర్చ నడుస్తున్న క్రమంలో బండ్ల గణేష్ ఆ సీక్రెట్ రివీల్ చేశారు.
2/ 8
దిల్ రాజుకు ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్ పెట్టారు బండ్ల గణేష్. దిల్ రాజు అన్నా కాంగ్రాచులేషన్స్ అని తెలుపుతూ ట్వీట్ పెట్టారు. ఈ మేరకు దిల్ రాజుకు కొడుకు పుట్టాడని తెలుపుతూ అసలు విషయాన్ని బయటపెట్టాడు.
3/ 8
టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు తండ్రి కాబోతున్నాడా..? అంటే అవును అంటూ గత కొన్ని నెలలుగా వస్తున్న వార్తలను నిజం చేస్తూ బండ్లన్న ట్వీట్ పెట్టారు. ఈ రోజు (బుధవారం) తెల్లవారు జామున దిల్ రాజుకు కొడుకు పుట్టాడని తెలుస్తోంది.
4/ 8
కాగా, దిల్ రాజు మరోసారి తండ్రి కావడం.. ఆయనకు కొడుకు పుట్టడం పట్ల టాలీవుడ్ సినీ లోకం ఆనందం వ్యక్తం చేస్తోంది. ఇంకేముంది వారసుడొచ్చాడు.. దూసుకుపో అంటూ పెద్ద ఎత్తున సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
5/ 8
టాలీవుడ్ లో డిస్ట్రిబ్యూటర్ గా కెరీర్ స్టార్ట్ చేసి సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ గా మారారు దిల్ రాజు. ఆయన అసలు పేరు రాజు కాగా.. నితిన్ హీరోగా నటించిన దిల్ సినిమా నిర్మించి సక్సెస్ కావడంతో ఆయనకు దిల్ రాజు అనే పేరు వచ్చింది.
6/ 8
దిల్ రాజు మొదటి భార్య శిరీష 2017లో అనారోగ్యంతో మరణించారు. దీంతో ఆయన దాదాపు రెండేళ్లు ఒంటరిగానే ఉన్నారు. దిల్ రాజు మొదలి భార్యకు ఓ కూతరు హన్షిత రెడ్డి ఉంది. ఆ కూతురుకు పెళ్ళై పిల్లలు కూడా ఉన్నారు.
7/ 8
దీంతో ఒంటరిగా ఉన్న తండ్రి బాధను చూడలేక ఆయనకు మరో పెళ్లి చేయాలనుకుంది దిల్ రాజు డాటర్. ఈ క్రమంలో దిల్ రాజుకు(Dil Raju Second Marriage) రెండే పెళ్లి చేసింది. అలా 49 ఏళ్ల వయసులో దిల్ రాజు కొత్త జీవితాన్ని ప్రారంభించారు.
8/ 8
రెండేళ్ల క్రితం నిజామాబాద్ జిల్లాలోని నర్సింగ్ పల్లిలోని వెంకటేశ్వర స్వామి గుడిలో తేజస్విని అనే అమ్మాయిని పెళ్లాడారు దిల్ రాజు. ఇప్పుడు ఈ దంపతులకు కుమారుడు జన్మించడంతో దిల్ రాజుకు వారసుడు వచ్చినట్లయింది. దిల్ రాజుకు కొడుకు పుట్టాడని తెలిసి పలువురు సినీ ప్రముఖులు కంగ్రాట్స్ చెబుతున్నారు.