Pawan Kalyan: టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రస్తుతం వరుస ప్రాజెక్టులతో బిజీగా మారిన పవన్ కళ్యాణ్ గత కొన్ని సంవత్సరాలు రాజకీయపరంగా సినిమాలకు దూరం అయ్యారు. ప్రస్తుతం ఫామ్ లో పవన్ కళ్యాణ్ ఊహించని విధంగా సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇక ఇదిలా ఉంటే తాజాగా పవన్ ఓల్డ్ ఫోటో ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ గా మారింది. ఇక ఈ ఫోటోను చూసిన అభిమానులు.. పవన్ కళ్యాణ్ ఒకప్పటి ఫోటో అచ్చం అర్జున్ రెడ్డిలో విజయ్ దేవరకొండ ఫోటో ఉన్నట్టు ఉందని సోషల్ మీడియాలో తెగ కామెంట్లు చేస్తున్నారు. ఇక నిజానికి అందులో పవన్ హెయిర్ స్టైల్, గడ్డం చూస్తే ఎవరైనా సరే అర్జున్ రెడ్డి అంటూ కామెంట్స్ చెయ్యాల్సిందే.