చిరంజీవి రాజకీయాలకు దూరంగానే ఉన్నాడు.. మరోవైపు జూనియర్ ఎన్టీఆర్ కూడా పాలిటిక్స్ అంటేనే నో అంటున్నాడు. మరోవైపు ఇతర హీరోలు కూడా బుద్దిగా సినిమాలు చేసుకుంటున్నారు. మరి రాజకీయాలు ఎక్కడ చేస్తున్నారబ్బా అని కన్ఫ్యూజ్ అవుతున్నారా..? రాజకీయాలు చేస్తున్న మాట నిజమే కానీ నిజ జీవితంలో మాత్రం కాదు. బాలయ్య, పవన్ కళ్యాణ్ లాంటి హీరోలు అటు రాజకీయాలు చేస్తూనే.. ఇటు సినిమాలు చేస్తున్నారు. ప్రస్తుతం తెలుగులో పొలిటికల్ బ్యాక్ డ్రాప్ మూవీస్ వరుసగా తెరకెక్కుతున్నాయి. (Twitter/Photo)
మిగిలిన హీరోలు మాత్రం కేవలం సినిమాల్లోనే పాలిటిక్స్ చేస్తున్నారు. మనవాళ్లు రాజకీయాలు చేస్తున్నది బయట కాదు.. సినిమాలలో మాత్రమే. తెలుగు ఇండస్ట్రీలో ఈ మధ్య ఎక్కువగా పొలిటికల్ బ్యాక్‌డ్రాప్ ఉన్న సినిమాలు వస్తున్నాయి. చిన్న హీరోలు కూడా రాజకీయ కథల వైపు అడుగులు వేస్తున్నారు. ఇప్పుడు సెట్స్‌పై ఉన్న చాలా సినిమాలలో ఉన్నది రాజకీయ నేపథ్యమే ఉంది.
మెగాస్టార్ చిరంజీవి హీరోగా మోహన్ రాజా దర్శకత్వంలో తెరకెక్కుతున్న గాడ్ ఫాదర్ సినిమాలో రాజకీయాలే ఎక్కువగా ఉంటాయి. అందులో జన జాగృతి పార్టీకి సంబంధించిన వ్యక్తిగా కనిపిస్తున్నాడు మెగాస్టార్. మలయాళం బ్లాక్‌బస్టర్ లూసీఫర్ సినిమాకు రీమేక్ ఇది. నయనతార ఇందులో కీలక పాత్రలో నటిస్తుంది. ఇప్పటికే షూటింగ్ చివరిదశకు వచ్చేసింది.
మరోవైపు రామ్ చరణ్, శంకర్ సినిమాలో కూడా రాజకీయాలు ఉండబోతున్నాయి. ఒకే ఒక్కడు సినిమాకు సీక్వెల్ ఇది అంటూ ప్రచారం జరుగుతుంది. ఇందులో అభ్యుదయ పార్టీ తరఫున చరణ్ కనిపించనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమా కోసం పూర్తిగా లుక్ మార్చేశాడు రామ్ చరణ్. దిల్ రాజు ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. కియారా అద్వాని హీరోయిన్గా నటిస్తోంది.
జూనియర్ ఎన్టీఆర్, కొరటాల శివ సినిమా కూడా పూర్తిగా రాజకీయ నేపథ్యమున్న కథాంశంతోనే రాబోతుంది. ఇందులో స్టూడెంట్ పాలిటిక్స్ చుట్టూ కథ తిరుగుతుంది అని తెలుస్తోంది. ఎన్టీఆర్ చాలా రోజుల తర్వాత పొలిటికల్ నేపథ్యం ఉన్న సినిమాలో నటిస్తున్నాడు. కెరీర్ మొదట్లో నాగ సినిమాలో స్టూడెంట్ లీడర్‌గా కనిపించాడు ఎన్టీఆర్. మళ్లీ ఇన్నేళ్లకు ఆ తరహా పాత్ర వైపు అడుగులు వేస్తున్నాడు. (Twitter/Photo)
ఇప్పటికే రెగ్యులర్ షూటింగ్ మొదలు పెట్టుకున్న బాలకృష్ణ, గోపీచంద్ మలినేని సినిమాలో కూడా రాజకీయాలు బాగానే కనిపించబోతున్నాయి. ఇందులో ఒక ప్రాంత రాజకీయ నాయకుడిగా, ఊరు పెద్దగా బాలయ్య కనిపిస్తున్నాడు. కన్నడలో నాలుగేళ్ల కింద వచ్చిన మఫ్టీ సినిమాకు ఇది రీమేక్ అనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇందులో కన్నడ హీరో దునియా విజయ్ విలన్‌గా నటిస్తున్నాడు.