Tollywood Nephews - Venkatesh - Naga Chaitanya Akkineni | సినీ ఇండస్ట్రీలో ఎన్నో ఏళ్లుగా హీరోలే (కుమారులు) వారసులే హీరోలుగా రాణిస్తున్నారు. అందులో హీరోల అక్క కుమారుడు, చెల్లెలు కుమారులు కూడా హీరోలుగా ఎంట్రీ ఇస్తున్నారు. ఇక అక్కినేని నట వారసుడిగా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన నాగ చైతన్య .. హీరో దగ్గుబాటి వెంకటేష్‌కు మేనల్లుడు అవుతారు. ఈయన వెంకీ చెల్లెలు కుమారుడు. టాలీవుడ్లో మేనమామ బాటలో నాగ చైతన్య కంటే ముందు తర్వాత హీరోలుగా ఎంట్రీ ఇచ్చిన మేనల్లుళ్లపై న్యూస్ 18 స్పెషల్ ఫోకస్.. (Twitter/Photo)
సాయి ధరమ్ తేజ్, వైష్ణవ్ తేజ్, నాగబాబు, పవన్ కళ్యాణ్ కు కూడా మేనల్లుళ్లే. మెగాస్టార్ చిరంజీవి, నాగబాబు చెల్లెలు కుమారుడు. పవన్ కళ్యాణ్‌కు అక్క ఈయన కూడా మేనమామల బాటలో టాలీవుడ్లో హీరోగా ఎంట్రీ ఇచ్చారు. అంతేకాదు మేనమామ బాటలో తన కంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు సాయి ధరమ్ తేజ్. (Twitter/Photo)
ఆదుర్తి సుబ్బారావు - సత్యానంద్ | తెలుగు చిత్ర పరిశ్రమలో దర్శకుడిగా ఆదుర్తి సుబ్బారావుకు ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. కృష్ణను వెండితెరకు పరిచయం చేసింది ఈయనే. ఇక ఆదుర్తి మేనల్లుడు సత్యానంద్ ఆయన అసిస్టెంట్‌గా పలు చిత్రాలకు పని చేసారు. ఆ తర్వాత ప్రముఖ కథా రచయతగా టాలీవుడ్లో అగ్ర హీరోల చిత్రాలకు కథా సహాకారం అందించారు. దర్శకుడిగా ఓ చిత్రం కూడా రూపొందించారు. (Twitter/Photo)