Megastar Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి పేరు తెలీనోలే లేరు. ఎందుకంటే టాలీవుడ్ లో ఎన్నో సినిమాలలో నటించి స్టార్ హీరోగా నిలిచాడు. నటుడిగానే కాకుండా సోషల్ సర్వీస్ లో కూడా ఎప్పుడూ ముందే ఉంటాడు. ఇప్పటికీ యంగ్ హీరోలతో పోటీగా వరుస సినిమాలలో అవకాశాలు అందుకుంటున్నాడు. ఇక సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా ఉంటాడు చిరు. ఇదిలా ఉంటే తాజాగా తన సోషల్ మీడియా వేదికగా ఓ వీడియో షేర్ చేశాడు. అందులో నీలకంఠపురం దేవాలయాలు తెరిచే సందర్భంగా శుభాకాంక్షలు తెలుపగా అందులో చిరంజీవి లుక్ అందర్నీ ఆశ్చర్య పరిచింది. తలకి హెయిర్ లేకుండా.. పైగా తెల్లని గడ్డంతో గ్రిప్పింగ్ లుక్ లో కనిపించాడు. ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట్లో వైరల్ గా మారగా ఆయన అభిమానులు ఆయన లుక్ ను చూసి తెగ మురిసిపోతున్నారు.