Tollywood: గత ఏడాది నుండి ఇప్పటివరకు దేశాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ ప్రభావం ఎంతలా ఏర్పడిందో చూస్తూనే ఉన్నాం.ఇక ఆర్థికపరంగా ఎన్నో నష్టాలు కలిగించింది. పైగా సినీ ఇండస్ట్రీకి మాత్రం తీవ్రమైన నష్టం ఏర్పడింది. గత ఏడాది లాక్ డౌన్ విధించినప్పటి నుంచి సినిమా షూటింగులు వాయిదాలు పడ్డాయి. థియేటర్లు మూసేశారు. ఆ సమయంలో తీవ్రంగా నష్టపోగా.. తిరిగి ఆరు నెలల తర్వాత మళ్లీ వైరస్ తీవ్రత తగ్గడంతో మరో మూడు నెలలు ఓ రేంజ్ లో సినిమాలు విడుదలయ్యాయి. మంచి లాభాలు వచ్చాయి. మళ్లీ ఈ ఏడాది సెకండ్ వేవ్ కారణంతో మళ్లీ సినిమా షూటింగ్ లు వాయిదా పడ్డాయి. ఇలా కరోనా వైరస్ కారణంగా ఇండస్ట్రీ దారుణంగా నష్టపోగా, మొత్తం రెండేళ్లకు 750 కోట్లు నష్టపోయినట్టు సినీ విశ్లేషకులు చెప్తున్నారు. మొదటి దశలో 500 కోట్లు, రెండవ దశ లో 250 కోట్లు నష్టం కలిగింది.