K Viswanath - Dadasaheb Phalke Award | దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు.మన దేశంలో సినీ రంగంలో అత్యున్నత పురస్కారం.17వ జాతీయ చలన చిత్ర అవార్డుల సమయం నుంచి ఈ అవార్డు ఇవ్వడం మొదలుపెట్టారు 1969లో ప్రారంభమైన ఈ అవార్డుల ప్రధానోత్సవం ఇప్పటి వరకు 52 మంది ఈ అత్యున్నత అవార్డు అందుకున్నారు. ఇక సౌత్ నుంచి కళాతపస్వీ దివంగత కాశీనాథుని విశ్వనాథ్‌తో పలువురు సౌత్ సినీ ప్రముఖులు ఈ అవార్డును అందుకున్నారు. వాళ్లెవరంటే..
రజినీకాంత్ | 2019 యేడాదిగాను దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును తమిళ చిత్ర సీమతో పాటు భారతీయ చిత్ర పరిశ్రమను తన కనుసైగలతో శాసించిన సూపర్ స్టార్ రజినీకాంత్‌ను వరించింది. కేంద్రం తలైవాకు ఈ అవార్డు ప్రధానం చేసింది. ఈ అవార్డు అందుకున్న 51వ భారతీయ సినీ ప్రముఖుడు. హీరోగా దక్షిణాది నుంచి ఈ అవార్డు అందుకుంటున్న 5వ కథానాయకుడు. ఈయన కంటే హీరోల్లో పైడి జైరాజ్, ఏఎన్నార్, రాజ్ కుమార్, శివాజీ గణేషణ్ ఈ అవార్డు అందుకున్నారు. (File/Photo)
డి. రామానాయుడు | 2009లో దేశంలోని అన్ని భాషల్లో సినిమాలు తీసిన శతాధిక నిర్మాత డి.రామానాయుడు దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు అందుకున్నారు. తెలుగు సినిమా చరిత్రను ఒక సారి పరిశీలిస్తే, ఆణిముత్యాల్లాంటి చిత్రాలు అందించిన సంస్థలను.. వేళ్లమీద లెక్కపెట్టవచ్చు. అలాంటి సినిమాలను అందించిన సంస్థల్లో సురేష్ ప్రొడక్షన్ కు తప్పక చోటు దక్కుతుంది. ఒక్క తెలుగులోనే కాదు. భారతీయ భాషల్లన్నింటిలోను అందులో కరెన్సీ పై ఉన్న అన్ని భాషల్లో చిత్రాలను అందించిన ఘనత ప్రముఖ నిర్మాణ సంస్థ సురేష్ ప్రొడక్షన్స్ అధినేత రామానాయుడుకు దక్కుతుంది. ఈ అవార్డు అందుకున్న 41వ భారతీయ సినీ ప్రముఖుడు. (File Photo)
వి.కే.మూర్తి | గురుదత్ ‘ప్యాసా’, ‘కాగజ్ కే ఫూల్’ వంటి పలు క్లాసిక్ హిందీ చిత్రాలకు కెమెరా మెన్‌గా పని చేసిన వి.కే.మూర్తి (2008)లో దాదా సాహెబ్ పాల్కే పురస్కారం అందున్నారు. బెంగళూరులో పుట్టిన వెంకటరామ పండిత కృష్ణమూర్తి ఎక్కువగా బాలీవుడ్ చిత్రాలకు పనిచేసారు. ఈ అవార్డు అందుకున్న 40వ భారతీయ సినీ ప్రముఖుడు. (Twitter/Photo)
ఎల్.వి.ప్రసాద్ | తొలి హిందీ టాకీ ‘ఆలం అరా’, తొలి తెలుగు టాకీ ‘భక్త ప్రహ్లాద’, తొలి తమిళ టాకీ ‘కాళిదాసు’ వంటి సినిమాల్లో నటించిన ఏకైక వ్యక్తి ఎల్.వి.ప్రసాద్. ఆ తర్వాత దర్శకుడిగా, నిర్మాతగా ఫిల్మ్ స్టూడియో అధినేతగా, ప్రసాద్ మల్టీప్లెక్స్ అధినేతగా సినిమాకు సంబంధించిన వివధ రంగాల్లో విశేష ప్రతిభ కనబరిచారు.ఈయను (1982)లో కేంద్రం దాదా సాహెబ్ ఫాల్కే అవార్డుతో సత్కరించింది. ఈ అవార్డు అందుకున్న 14వ వ్యక్తి. (File/Photo)
బొమ్మిరెడ్డి నరసింహారెడ్డి |ఎన్టీఆర్, ఏఎన్నార్ వంటి అగ్రనటులతో క్లాసిక్స్ తెరకెక్కించిన వాహినీ స్టూడియో అధినేత ప్రముఖ దర్శకుడు నిర్మాత బొమ్మిరెడ్డి నరసింహారెడ్డి (బి.నాగిరెడ్డి )1974లో దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు అందుకున్నారు. దక్షిణాది నుంచి ఈ అవార్డు అందుకున్న తొలి వ్యక్తిగా రికార్డులకు ఎక్కారు. మొత్తంగా ఈ అవార్డు అందుకున్న 6వ వ్యక్తి ఇతను. (File/Photo)