Tollywood Industry hits | తెలుగు సినిమా టాకీ నుంచి మొదలు పెడితే.. డిజిటల్ వరకు ఎన్నో సినిమాలు తెలుగు తెరపై అలరించాయి. అలాంటి చిత్రాల్లో కొన్ని మాత్రమే అత్యంత ప్రేక్షకాదరణ పొందుతాయి. అంతేకాదు అప్పటి వరకు ఉన్న అన్ని రికార్డులు అంటే ఎక్కువ మంది ప్రేక్షకులు లేదా ఎక్కువ కలెక్షన్లు సాధించిన చిత్రాలుగా నిలిచాయి. అల తెలుగు సినీ ఇండస్ట్రీలో ఇండస్ట్రీ హిట్ సాధించిన సినిమాల విషయానికొస్తే.. (Twitter/Photo)
2017లో రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా తెరకెక్కిన ‘బాహుబలి 2’ చిత్రం తెలుగు సినీ ఇండస్ట్రీలో భారతీయ సినీ ఇండస్ట్రీలో ఎక్కువ వసూళ్లను సాధించిన చిత్రంగా రికార్డులకు ఎక్కింది. ఈ చిత్రం దాదాపు రూ 2వేల కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించింది. తెలుగులో ఈ సినిమా రూ. 325 కోట్ల షేర్ సాధించింది. (Twitter/Photo)
1977లో ఎన్టీఆర్ హీరోగా కే.రాఘవేంద్రరావు దర్శకత్వంలో తెరకెక్కిన ’అడవి రాముడు’ సినిమా ఇండస్ట్రీ హిట్గా నిలిచింది. అంతేకాదు తెలుగు లో తొలి రూ. కోటి షేర్ సాధించిన చిత్రంగా నిలిచింది. అదే యేడాది ఎన్టీఆర్ నటించిన దాన వీర శూర కర్ణ, యమగోల చిత్రాలు కూడా ఇండస్ట్రీ హిట్ నమోదు చేసాయి. మొత్తంగా చాలా సినిమాలు ఇండస్ట్రీ హిట్గా నిలిచాయి. (NTR Adavi Ramudu)