సినిమా సెలబ్రిటీల పార్టీలు, వెకేషన్ ట్రిప్స్‌కు సంబంధించిన ఫోటోలు చూడాలని ప్రతి ఒక్కరికి ఆసక్తి ఉంటుంది. ముఖ్యంగా టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సంగతి వేరే చెప్పనక్కర్లేదు. ఈ హీరో అప్డేట్స్, హ్యాపీ మూమెంట్స్ షేర్ చేసుకునేందుకు నెటిజన్లు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తుంటారు. (Photo:Instagram)
స్టార్ హీరోల్లో అల్లు అర్జున్‌కి ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. పుష్ప సినిమాతో ఆ గుర్తింపు జాతీయ స్థాయి నుంచి వరల్డ్ వైడ్‌గా విస్తరించింది. అందుకే తన అప్ కమింగ్ మూవీ పుష్ప-2 సీక్వెల్ కోసం తెగ కష్టపడుతున్నాడు. సినిమా కోసం గడ్డం, జుట్టు పెంచుకొని హాలీవుడ్ స్టార్ రేంజ్లో అల్లు అర్జున్ ఆకట్టుకుంటున్నాడు. (Photo:Instagram)