నమ్మడానికి ఇది కాస్త విచిత్రంగా అనిపించినా కూడా ఇప్పుడు ఇదే జరుగుతుందని తెలుస్తుంది. అల్లు అర్జున్ పుష్ప సినిమా రికార్డులు తిరగరాస్తుంది. ముఖ్యంగా ప్రీ రిలీజ్ బిజినెస్ పరంగా ఈ చిత్రం అదరహో అనిపిస్తుంది. ట్రేడ్ వర్గాలను సైతం ఆశ్చర్యపరుస్తూ ఎవరూ ఊహించని రేంజ్లో బిజినెస్ చేస్తుంది పుష్ప. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా.. సంచలన దర్శకుడు సుకుమార్ తెరకెక్కిస్తున్న సెన్సేషనల్ ప్రాజెక్టు పుష్ప.
ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు వేగంగా జరుగుతున్నాయి. డిసెంబర్ 17న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. సినిమాకుU/A సర్టిఫికెట్ ఇచ్చారు సెన్సార్ బోర్డ్. ఈ సినిమా నుంచి విడుదలైన ప్రతి ఒక్క ఫోటో, పోస్టర్, టీజర్, ట్రైలర్ అన్నీ అద్భుతమైన రెస్పాన్స్ తెచ్చుకున్నాయి.
కేవలం తెలుగులో మాత్రమే కాదు మిగిలిన భాషల్లో కూడా పుష్ప సినిమా కంటెంట్ కు అద్భుతమైన స్పందన వస్తోంది. ఆర్య, ఆర్య 2 తర్వాత సుకుమార్, అల్లు అర్జున్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా కావడంతో అంచనాలు ఆకాశంలో ఉన్నాయి. వాటికి ఏ మాత్రం తగ్గకుండా ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా జరుగుతుంది. ఒకటి రెండూ కాదు ఏకంగా 250 కోట్ల బిజినెస్ ఈ సినిమాకు జరుపుతున్నట్లు తెలుస్తోంది.
తొలిసారి అల్లు అర్జున్ పాన్ ఇండియా సినిమా చేయడంతో ఈ బిజినెస్ సాధ్యమైందని ట్రేడ్ పండితులు చెబుతున్నారు. అల వైకుంఠపురంలో లాంటి ఇండస్ట్రీ హిట్ తరువాత అల్లు అర్జున్ నుంచి రాబోతున్న సినిమా కావడంతో భారీ ధరలకు పుష్ప అమ్ముడైంది. మరోవైపు క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ రంగంస్థలం లాంటి బ్లాక్ బస్టర్ హిట్ తరువాత చేస్తున్న సినిమా పుష్ప ది రైజ్.
అందుకే అన్ని ఏరియాల్లో ప్రీ రిలీజ్ బిజినెస్ కి ఫ్యాన్సీ రేట్లు ఆఫర్ చేశారు డిస్ట్రిబ్యూటర్లు. అన్నింటికీ మించి సుకుమార్, అల్లు అర్జున్ కాంబినేషన్లో వస్తున్న హ్యాట్రిక్ సినిమా కావడంతో వందల కోట్ల బిజినెస్ సాధ్యమైందని తెలుస్తోంది. తెలుగు, తమిళ, మళయాలం, కన్నడ, హిందీ భాషల్లో థియేట్రికల్.. అలాగే నాన్ థియేట్రికల్ (ఓటిటి, డిజిటిల్ రైట్స్, శాటిలైట్ రైట్స్, ఆడియో, హిందీ డబ్బింగ్ రైట్స్) కలుపుకొని పుష్ప బిజినెస్ 250 కోట్ల వరకు జరిగినట్లు లెక్కలు చెబుతున్నాయి.
ఇవన్నీ చూస్తుంటే సినిమాలో అల్లు అర్జున్ డైలాగ్ చెప్పినట్లు ప్రీ రిలీజ్ బిజినెస్ లో పుష్ప ది రైజ్ తగ్గేదేలె అనిపిస్తుంది. భారీ అంచనాలతో డిసెంబర్ 17న 5 భాషల్లో గ్రాండ్ గా విడుదల కాబోతుంది ఐకాన్ స్టార్ అర్జున్ పుష్ప ది రైజ్. రష్మిక మందన్న హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రంలో సునీల్, అనసూయ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. మలయాళ స్టార్ హీరో ఫహాద్ ఫాజిల్ ఇందులో విలన్. మైత్రి మూవీ మేకర్స్, ముత్తంశెట్టి మీడియా సంయుక్తంగా పుష్ప సినిమాను నిర్మిస్తున్నారు.
ఈ సినిమాలో సమంత స్పెషల్ సాంగ్ చేసింది. ఉ అంటావా మావ.. ఉఉ అంటావా మావా అంటూ సాగే ఈ పాట ఇప్పటికే సంచలనం రేపుతుంది. మిలియన్స్ కొద్దీ వ్యూస్ అందుకుంటుంది స్యామ్ సాంగ్. రేపు సినిమాలో ఇంకా రప్ఫాడిస్తుందని నమ్ముతున్నారు చిత్రయూనిట్. దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం పుష్ప సినిమాకు అదనపు ఆకర్షణ. మరి ఇవన్నీ కలిపి ఈ స్థాయి బిజినెస్‌ను తట్టుకుంటుందేమో చూడాలి.