Rakul Preet Singh: రకుల్ ప్రీత్ సింగ్.. ప్రత్యేకంగా పరిచయం అవసరం లేని పేరు. పదేళ్ల కింద కన్నడ సినిమా గిల్లితో ఇండస్ట్రీకి వచ్చింది ఈ భామ. ఆ తర్వాత హిందీలో యారియాన్ సినిమాతో గుర్తింపు తెచ్చుకుంది. ఫిజిక్ విషయంలో రకుల్‌ను చూస్తుంటే మిగిలిన హీరోయిన్లకు కుళ్లు వచ్చేస్తుంటుంది.
రకుల్ ప్రీత్ సింగ్.. ప్రత్యేకంగా పరిచయం అవసరం లేని పేరు. పదేళ్ల కింద కన్నడ సినిమా గిల్లితో ఇండస్ట్రీకి వచ్చింది ఈ భామ. ఆ తర్వాత హిందీలో యారియాన్ సినిమాతో గుర్తింపు తెచ్చుకుంది. ఆ వెంటనే సందీప్ కిషన్ వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్ సినిమాతో తెలుగు ఇండస్ట్రీలో ఫస్ట్ హిట్ అందుకుంది.
2/ 8
బ్రూస్లీ సినిమాతో స్టార్ హీరోయిన్ అయిపోయింది. బ్రూస్లీ ఫ్లాప్ అయినా కూడా ఇండస్ట్రీలో రకుల్ పేరు మార్మోగిపోయింది. వరస అవకాశాలు అందుకుంది. నాన్నకు ప్రేమతో, సరైనోడు, స్పైడర్ లాంటి భారీ సినిమాలతో దూసుకుపోయింది. ఇప్పటికీ రకుల్ వరస సినిమాలు చేస్తూనే ఉంది.
3/ 8
ముఖ్యంగా ఫిజిక్ విషయంలో రకుల్‌ను చూస్తుంటే మిగిలిన హీరోయిన్లకు కుళ్లు వచ్చేస్తుంటుంది. అంతగా ఫిగర్ మెయింటేన్ చేస్తుంది ఈ భామ. రోజుకు కనీసం 4 గంటలు జిమ్ చేయకపోతే అసలు ఈ భామకు సమయం గడవదు. పైగా సొంత జిమ్‌లు కూడా ఉన్నాయిగా.. అక్కడ కూడా భారీగానే సంపాదిస్తుంది ఈ బ్యూటీ.
4/ 8
హీరోయిన్స్ ఇంత అందంగా ఉండాలంటే కొన్ని యిష్టమైన ఫుడ్స్ కూడా తినకుండా కడుపు కాల్చుకోవాల్సిందే. ఎందుకంటే ఏది తింటే ఒళ్లు ఎలా పెరిగిపోతుందో.. ఎక్కడ కొవ్వు వస్తుందో కూడా తెలియదు. అందుకే కంటికి, పంటికి ఇంపుగా ఉన్నా కూడా కొన్ని పక్కనబెట్టేస్తుంటారు.
5/ 8
అయితే రకుల్ మాత్రం అలా కాదు. మనసుకు నచ్చినవి మనస్పూర్థిగా లాగిస్తుంది. ఏది కావాలంటే అది తినేస్తుంది. ఆ తర్వాత జిమ్‌లో చూసుకుందాం అనుకుంటుంది రకుల్. అలాగే ఈమెకు బాగా యిష్టమైన రెండు ఫుడ్స్ ఉన్నాయి. అవి చూసిన వెంటనే తనకు నోట్లో లాలాజలం ఊరుతుందంటుంది రకుల్.
6/ 8
ఈ భామ మనసు దోచిన ఆ ఫుడ్స్ ఏంటో తెలుసా.. ఒకటి గులాబ్ జామూన్, రెండు ఆలు పరాటా. పంజాబీ అమ్మాయి కాబట్టి ఆలు పక్కాగా ఉంటుంది. మరోటి గులాబ్ జామూన్ కూడా. ఇది కనిపిస్తే కంట్రోల్ చేసుకోవడం కష్టమే అంటుంది ఈ భామ.
7/ 8
వెంటనే తినేసి ఆ తర్వాత ఫిజిక్ గురించి ఆలోచిస్తానంటుంది. తనకు తినడం మాత్రమే వచ్చు కానీ వండటం రాదని ముందుగానే చెప్పేస్తుంది రకుల్. అయినా కూడా ఈ లాక్ డౌన్ సమయంలో కొన్ని వంటలు వండటానికి ప్రయత్నించానని చెప్తుంది ఈ ముద్దుగుమ్మ.
8/ 8
ప్రస్తుతం తెలుగులో వైష్ణవ్ తేజ్, క్రిష్ సినిమాతో పాటు నితిన్, చంద్రశేఖర్ యేలేటి చెక్ సినిమాలలో నటిస్తుంది. దాంతో పాటు భారతీయుడు 2లో కమల్ హాసన్‌తో హిందీలో రెండు సినిమాలు చేస్తుంది రకుల్ ప్రీత్ సింగ్.