తెలుగు ఇండస్ట్రీలో ఉన్న టాప్ యాంకర్స్‌లో అనసూయ(Anasuya), రష్మి(Rashmi), సుమ(Suma Kanakala) తర్వాత వర్షిణి (Anchor Varshini Souderajan) పేరు కూడా బాగానే వినిపిస్తుంది. ఈ మధ్య కాలంలో యాంకరింగ్ కంటే కూడా ఎక్కువగా సినిమాలు, హాట్ షో పైనే ఫోకస్ చేస్తుంది ఈ ముద్దుగుమ్మ. ఎప్పటికప్పుడు కొత్త ఫోటోషూట్స్ చేయడమే కాకుండా.. అవి సోషల్ మీడియాలో వైరల్ అయ్యే వరకు కూడా నిద్ర పోదు వర్షిణి. ఇప్పుడు కూడా ఇదే జరుగుతుంది.
తెలుగు బుల్లితెరపై తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకునే వరకు వర్షిణి అందాల రచ్చ ఆపేలా కనిపించడం లేదు. రష్మి గౌతమ్, అనసూయ లాంటి వాళ్లకు పోటీగా తన గ్లామర్ కూడా ఒలకబోస్తుంది వర్షిణి. ఈ భామ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. తెలుగులో చాలా షోలతో పాటు సినిమాలు కూడా చేసింది వర్షిణి. యాంకర్ కాకముందే హీరోయిన్‌గానూ నటించింది.
కొన్ని సినిమాల్లో కీలకమైన పాత్రలు చేసింది.. అలాగే వెబ్ సిరీస్‌లో హీరోయిన్‌గానూ అలరించింది. ఆ తర్వాత ఢీ షో యాంకర్‌గా బాగా పాపులర్ అయింది వర్షిణి. అన్నింటి కంటే ముందు హాట్ షో చేస్తూ ఎప్పటికప్పుడు మతులు పోగొట్టడంలో వర్షిణిని మించిన వాళ్లు లేరేమో..? ఆ మధ్య హైపర్ ఆదితోనూ కొన్ని రోజులు ఎఫైర్ అంటూ వార్తలు వచ్చాయి. ఢీ షో చేస్తున్న సమయంలో ఈ ఇద్దరి మధ్య కెమిస్ట్రీ అలా ఉండేది మరి.
సుధీర్, రష్మీ జోడీని కూడా కొన్ని రోజుల పాటు డామినేట్ చేసారు ఆది, వర్షిణి. అప్పట్లో ఓ ఈవెంట్లో అందరి ముందు హైపర్ ఆదిని ఈజీగా అలా ఎత్తుకుంది యాంకర్ వర్షిణి. వెంటనే ఎలా ఉంది నీకు అంటూ ఆదిని అడగ్గానే ఇంకాసేపు అలాగే ఎత్తుకుంటే బాగుండేది అంటూ మరో బూతు పంచ్ వేసాడు. అప్పట్లో ఇదంతా వైరల్ అయింది కూడా. షోలు మాత్రమే కాదు.. తాజాగా నడుము చూపిస్తూ రెచ్చిపోయిన ఈమె ఫోటోలు వైరల్ అవుతున్నాయి.
ఇదిలా ఉంటే ఈ మధ్యే ఓ ఇంటర్వ్యూకు వచ్చిన వర్షిణి.. సినిమా ఇండస్ట్రీలో తనకు ఎదురైన అనుభవాల గురించి చెప్పుకొచ్చింది. తాను బుల్లితెరపైకి రావాలని ఎప్పుడూ ప్లాన్ చేసుకోలేదని.. మోడలింగ్ చేసేటప్పుడు అవకాశాలే తన వెంట వచ్చాయని చెప్పుకొచ్చింది. అందులో మంచి అవకాశాలను అందిపుచ్చుకొని తాను ఈ రోజు ఈ స్థాయిలో ఉన్నానని గుర్తు చేసుకుంది.
తన ప్రయాణం గురించి తలుచుకుంటే కన్నీరు వస్తుందని చెప్పింది వర్షిణి. ఇంతవరకు రావడానికి నేను ఎన్నో అవమానాలు, బాధలు ఎదుర్కోవాల్సి వచ్చిందని గుర్తు చేసుకుంది. ఓ ప్రముఖ టాలీవుడ్ దర్శకుడు తనకు సినిమాలో ఛాన్స్ ఇస్తానని చెప్పి అసభ్యంగా ప్రవర్తించాడని సంచలన విషయాలు బయటపెట్టింది వర్షిణి. అగ్రిమెంట్‌పై సైన్ చేయాలి.. తన ఇంటికి రమ్మని పిలిచాడని చెప్పింది.
తాను అలాగే ఇంటికి వెళ్లగా దురుసుగా ప్రవర్తించాడమే కాకుండా చేయి పట్టి బెడ్డుపై పడేయబోయాడని చెప్పుకొచ్చింది వర్షిణి. దీంతో తాను కోపంతో అతని చెంప పగలగొట్టానని చెప్పింది వర్షిణి. అయితే ఆ దర్శకుడు ఎవరు.. పేరేంటి.. సినిమా ఏంటి అనేది మాత్రం చెప్పలేదు ఈ ముద్దుగుమ్మ. ఓ వైపు హాట్ ఫోటోషూట్స్ చేస్తూనే మరోవైపు సినిమాల్లో అవకాశాల కోసం చూస్తుంది వర్షిణి. చిన్న చిన్న పాత్రలు కూడా చేస్తుంది.
తాజాగా సుమంత్ హీరోగా నటిస్తున్న మళ్లీ మొదలైంది సినిమాలో ఆయన భార్యగా పెద్ద పాత్రే చేసింది వర్షిణి. ఫిబ్రవరిలో ఈ సినిమా నేరుగా ఓటిటిలో విడుదలకు సిద్ధమైంది. దాంతో పాటు గతంలోనూ కొన్ని సినిమాలలో కీలకమైన పాత్రల్లో నటించింది వర్షిణి. గ్లామర్ షో మాత్రమే కాదు.. అవసరమైతే తనలోని నటిని కూడా బయటికి తీస్తానంటుంది ఈ ముద్దుగుమ్మ.