Tollywood Heroines tatoos: చాలా మంది టాటూస్ అంటే బాగా ఆసక్తి చూపుతారు. ఇక ముఖ్యంగా సెలబ్రిటీల విషయంలో టాటూస్ ఎంత ఇష్టపడతారో.. వారి టాటూస్ చూస్తేనే అర్థమవుతుంది. ఇక ప్రస్తుతం టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో ఎంతో మంది హీరోయిన్స్ రకరకాల డిజైన్లతో టాటూలను వేయించుకున్నారు. వాళ్లెవరో ఇప్పుడు తెలుసుకుందాం..
ప్రస్తుతం టాలీవుడ్ స్టార్ హీరోయిన్ గా గుర్తింపు పొందిన సమంత గురించి అందరికీ తెలిసిందే. ఇక సమంత కు టాటూస్ అంటే ఎంతో ఇష్టం. ఆమె శరీరంపై 2 టాటూ లు ఉండగా.. ఒకటి ఆమె మెడపై 'వై ఎం సి' అని ఉంది. దీని అర్థం 'యు ఆర్ మై చై'. మరొకటి తన కుడిచేతి మణికట్టు మీద ఉంది. అది ఒక రోమన్ సింబల్ గా ఉండగా.. అలాంటివి చైతు చేతిపై కూడా ఉంది.
ఇక మరో తెలుగు సినీ నటి ప్రియమణి ఎడమచేతి మీద డాడీ లిటిల్ గర్ల్ అన్నట్టు టాటూ వేయించుకుంది. టాలీవుడ్ గ్లామర్ బ్యూటీ తాప్సీ పన్ను గురించి అందరికి తెలిసిందే. ఇక ఈమెకు ఎడమ కాలి మీద డాన్స్ గర్ల్ టాటూ ఉంది. ఇక మరో గ్లామర్ బ్యూటీ ఇలియానా రెండు టాటులను వేయించుకుంది. తన ఎడమచేతి మీద ఇన్స్పిరేర్ అని ఉంది. దీని అర్థం ప్రేరణ కోసమని తెలిసినది. మరొకటి తన అరచేతి వెనుక భాగంలో మూడు చుక్కల తో టాటూ వేయించుకోగా.. అది తన సోదరిల పై ఉన్న ప్రేమను చూపిస్తుంది.
ఇక మరో తెలుగు సినీ నటి ఛార్మి. ఇక ఆమె కాలు మీద ఒక టాటూ, చేతిపై స్పానిష్ భాషలో ఓ టాటూ ఉంది. అను ఇమ్మానుయేల్ వీపు పై.. ఓ సింబల్ తో టాటూ ఉంది. ఇక మరో బ్యూటీ సంజన చేతి మీద నెవెర్ గ్యీవ్ అప్ అని ఉంది. ఇక మరో బ్యూటీ సలోని కూడా ఎదపై బొమ్మ టాటూ ఉంది. ఇక అర్జున్ రెడ్డి బాబా షాలిని పాండే కాలిపై మ్యూజిక్ సింబల్ తో పాటు రెండు ఎమోజీ లు ఉన్నాయి.