Vijayashanti: టాలీవుడ్ లేడీ సూపర్ స్టార్ విజయశాంతి గురించి అందరికీ తెలిసిందే. నటిగానే కాకుండా నిర్మాతగా కూడా బాధ్యతలు చేపట్టింది. రాజకీయ నాయకురాలిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషలలో నటించి స్టార్ హోదాను అందుకుంది.ఇక ఇప్పటికీ ఇండస్ట్రీలో కొనసాగుతూ వయసుకు తగ్గ పాత్రలలో నటిస్తుంది. ఇదిలా ఉంటే తెలుగు ప్రేక్షకులందరు ఈమె సొంత ప్రాంతం తెలంగాణ అని అనుకున్నారు. కానీ ఈమె సొంత ఊరు తూర్పు గోదావరి జిల్లా, అనపర్తి గ్రామం. ఇక ఈమె తల్లిదండ్రులు సతీష్ శ్రీనివాస్ ప్రసాద్, వరలక్ష్మి. ఈ గ్రామంలోనే 1966లో జన్మించింది విజయశాంతి.