Tamannaah: టాలీవుడ్ మిల్కీ బ్యూటీ తమన్నా.. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉంది. తన నటనకు మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ గ్లామర్ బ్యూటీ స్టార్ హీరోల సరసన నటించి స్టార్ హీరోయిన్ గా నిలిచింది. తెలుగులోనే కాకుండా హిందీ, తమిళం భాషలలో కూడా నటించింది. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కిన బాహుబలి లో మంచి క్రేజ్ సంపాదించుకుంది. ఇక ఈ బ్యూటీ సోషల్ మీడియాలో కూడా బాగా యాక్టివ్ గా ఉంటుంది. సోషల్ సర్వీస్ ల పట్ల బాగా ముందుంటుంది. ఇదిలా ఉంటే ప్రస్తుతం ఎఫ్3, గుర్తుందా శీతాకాలం సినిమాలలో బిజీగా ఉండగా తాజాగా మరో పాన్ ఇండియా సినిమాలో అవకాశం అందుకుంది. ప్రస్తుతం రాకింగ్ స్టార్ యష్ కన్నడ డైరెక్టర్ నార్తన్ దర్శకత్వంలో తెరకెక్కనున్న భారీ యాక్షన్ థ్రిల్లర్ సినిమాలో నటించనున్నాడు. ఇక ఈ సినిమాలో తమన్నా హీరోయిన్ గా నటించనున్నట్టు తెలుస్తోంది. ఈ సినిమా ఆర్మీ నేపథ్యంలో రూపొందనున్నట్లు తెలుస్తుంది.