Samantha Akkineni: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ఓ వైపు సినిమాలలో మరోవైపు బిజినెస్ లలోనే కాకుండా సోషల్ మీడియాలో కూడా బాగా బిజీగా ఉంటుంది. నిత్యం తను వర్క్ అవుట్ లు చేసే వీడియోలను, తనకు సంబంధించిన ట్రెండీ ఫోటోలను బాగా పంచుకుంటుంది. ఇదిలా ఉంటే తాజాగా తను ఓ వారం గడిపిన క్షణాల గురించి కూడా సోషల్ మీడియాలో పంచుకుంది. గతవారం సమంత శాకుంతలం సినిమా షూటింగ్లో బిజీగా ఉండగా సినిమాను పూర్తి చేసుకుంది. ఇక ఈ నేపథ్యంలో తను గత వారం మొత్తం శాకుంతలం సినిమా బృందంతో బాగా గడిపినట్లు.. అంతే కాకుండా బాగా ఎమోషనల్ అయినట్లు కనిపించింది. తన ఫ్రెండ్ శిల్పారెడ్డితో దిగిన ఫోటోలను, ఈవెంట్ లలో పాల్గొన్న ఫోటోలను, సాకీ డిజైన్ కోసం దిగిన ఫోటోలను అలా కొన్ని పంచుకోగా ప్రస్తుతం ఆ వీడియో వైరల్ గా మారింది.