Rashmika Mandanna: టాలీవుడ్లో అతి తక్కువ సమయంలో స్టార్ హీరోల సరసన నటించి స్టార్ హీరోయిన్ గా నిలిచిన బ్యూటీ రష్మిక మందన. 'ఛలో' సినిమాతో అడుగుపెట్టిన ఈ ముద్దుగుమ్మ అంతకుముందే కన్నడ సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమైంది. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉండగా హిందీ, తమిళంలో కూడా అవకాశాలు అందుకుంది. సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే రష్మికను ఇండియన్ క్రష్ గా పిలుచుకుంటున్నారు అభిమానులు. ఫోటోలు, వీడియోలు బాగా షేర్ చేస్తూ రచ్చ చేస్తుంది. తాజాగా తన ఇన్ స్టా వేదికగా తన పెట్ 'ఆరా' తోనున్న వీడియో షేర్ చేసుకోగా.. దానికి రష్మిక తల వెంట్రుకలను, కంటిపాపపైనున్న హెయిర్ ను ఛీవ్ టాయ్ లాగే తినడం ఇష్టమట.ఇక యామ్ అంటూ రష్మిక క్యాప్షన్ ఇవ్వగా ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో వైరల్ గా మారింది.