Priyanka Jawalkar: టాలీవుడ్ హీరోయిన్ ప్రియాంక జవాల్కర్ పరిచయం గురించి తెలుగు ప్రేక్షకులందరికీ తెలిసిందే. యంగ్ హీరో విజయ్ దేవరకొండ నటించిన టాక్సీవాలా సినిమాలో హీరోయిన్ గా నటించి తన అందంతో యువత మనసులు దోచుకుంది. రాయలసీమకు చెందిన ఈ బ్యూటీ కలవరమాయే సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమైంది. ఇక ఇటీవలే తిమ్మరసు, ఎస్ ఆర్ కళ్యాణమండపంతో మంచి సక్సెస్ అందుకుంది. సోషల్ మీడియాలో కూడా బాగా బిజీగా ఉంటుంది. తాజాగా తన ఇన్ స్టా వేదికగా ఓ ఫోటో పంచుకోగా.. అందులో లవ్ సింబల్ చూపిస్తూ.. ప్రేమ విషయంలో ద్వేషించేది లేదంటుంది ప్రియాంక.